కీచక ఉపాధ్యాయుడికి 100ఏళ్ల జైలు శిక్ష

ABN , First Publish Date - 2021-06-24T05:18:35+05:30 IST

అమెరికాలో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. విద్యా బుద్ధులు నేర్పే ఉపాధ్యాయుడిని అనే విషయాన్ని మర్చిపోయి విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించిన కీచక టీచర్‌కు కోర్టు కఠిన శిక్ష విధించింది. పూర్తి వివరాల్లో

కీచక ఉపాధ్యాయుడికి 100ఏళ్ల జైలు శిక్ష

వాషింగ్టన్: అమెరికాలో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. విద్యా బుద్ధులు నేర్పే ఉపాధ్యాయుడిని అనే విషయాన్ని మర్చిపోయి విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించిన కీచక టీచర్‌కు కోర్టు కఠిన శిక్ష విధించింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని సౌత్ డకోటా రాష్ట్రానికి చెందిన థామస్ రిచార్డ్ (72) ఓ ప్రవేట్ పాఠశాలలో ఎలిమెంటరీ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తించేవాడు. ఇదే సమయంలో పాఠశాలలోని కొంతమంది విద్యార్థులను లైంగికంగా వేధించాడు. ఈ క్రమంలో 2019 మేలో ఈ వ్యవహారంపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రిచార్డ్ థామస్.. విద్యార్థులపై లైంగిక దాడికిపాల్పడినట్టు విచారణలో తేలింది. ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు.. థామస్ రిచార్డ్‌ను దోషిగా తేల్చింది. 100 సంవత్సరాల జైలు శిక్షను విధిస్తూ తీర్పు వెల్లడించింది. 


Updated Date - 2021-06-24T05:18:35+05:30 IST