ఉప్పొంగిన దేశభక్తి

ABN , First Publish Date - 2022-08-17T04:41:12+05:30 IST

జిల్లా వ్యాప్తంగా మంగళవారం వజ్రోత్సవాల్లో భాగం గా విద్యార్థులు, యువకులు, మహిళలు, అధికారులు, ప్రజాప్రతినిధులు సామూహిక జాతీయ గీతాలాపన చేశారు.

ఉప్పొంగిన దేశభక్తి
నారాయణపేట బారంబావి వద్ద సామూహిక జాతీయ గీతాలాపనలో పాల్గొన్న విద్యార్థులు

- ఘనంగా సామూహిక జాతీయ గీతాలాపన

- పాల్గొన్న అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, యువకులు

- భారీ జెండాల ఊరేగింపుతో దేశభక్తిని చాటుకున్న వైనం

 - అంబరాన్నంటిన వజ్రోత్సవాలు

నారాయణపేట, ఆగస్టు 16 : జిల్లా వ్యాప్తంగా మంగళవారం వజ్రోత్సవాల్లో భాగం గా విద్యార్థులు, యువకులు, మహిళలు, అధికారులు, ప్రజాప్రతినిధులు సామూహిక జాతీయ గీతాలాపన చేశారు. 

నారాయణపేట క్రైం :  జిల్లా కేంద్రంలోని సత్యనారాయణ చౌరస్తాలో మంగళవారం ఉదయం 11.30 గంటలకు జిల్లా పోలీ స్‌శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం విజయవంతమైంది. కాకతీయ, హంసవాహిని, లిటిల్‌స్టార్స్‌, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, మైనార్టీ స్కూల్‌, ప్రతిభ జూనియర్‌ కళాశాల విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరై జాతీయ గేయాన్ని ఆలపించారు. ముందు గానే పోలీస్‌శాఖ ఎక్కడికక్కడ రోడ్లపై వాహనాలను నిలిపి జాతీయ గీతాలాపనలో పాల్గొనేలా ప్రతీ ఒక్కరిని ప్రోత్సహించారు.  గ్రామ పోలీస్‌ అధికారులు జిల్లాలోని ఆయా గ్రామాల్లో సామూహిక జాతీయ గీతాలా పన కార్యక్రమాన్ని గ్రామస్థులు, ప్రజాప్రతి నిధులతో కలిసి నిర్వహించారు.

నారాయణపేట రూరల్‌ : మండలంలోని వివిధ గ్రామాల్లో స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ పిలుపు మేరకు మంగళవారం జాతీయ గీతాలాపన నిర్వహించారు. మండలంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో ఆర్‌ఐ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో నిర్వహించగా వివిధ గ్రామాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు ఎక్కడికక్కడే జాతీయ గీతాలాపన చేశారు. 

మరికల్‌ : స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా మంగళవారం మండల కేంద్రంలోని ఇందిరా గాంధీ చౌరస్తాలో సీఐ రాంలాల్‌ ఆధ్వర్యంలో ఉదయం 11.30 గంటలకు సామూహిక జాతీయ గీతాలాపన నిర్వహించారు.  జడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ సురేఖరెడ్డి, ఎంపీపీ శ్రీకళరెడ్డి, ఎంపీడీవో యశోదమ్మ, ఎస్‌ఐ ఆశోక్‌బాబు పాల్గొన్నారు. 

నర్వ : మండల కేంద్రంలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో తిరంగా వందన సమర్పన ర్యాలీని మంగళవారం అధికారులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలల విద్యార్థులు జై భారత్‌ మాతాకీ జై అంటూ నినాదాలతో జాతీయ జెండాలతో అంబేడ్కర్‌ కూడలి వద్దకు చేరుకున్నారు. 11:30 గంటలకు సామూహిక జాతీయ గీతాలాపన నిర్వహించారు. ఎంపీడీవో రమేష్‌, తహసీల్దార్‌ దయాకర్‌రెడ్డి, ఎస్‌ఐ విక్ర మ్‌, సర్పంచ్‌ సంధ్య, ఎంపీపీ జయరాము లుశెట్టి, వైస్‌ ఎంపీపీ వీణావతి పాల్గొన్నారు.

కృష్ణ : స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా మండల కేంద్రంలోని ప్ర భుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కార్యాలయాల తో పాటు టైరోడ్డు 167 జాతీయ రహదా రిపై మంగళవారం 11:30 గంటలకు సా మూహిక  జాతీయ గీతాలాపన చేశారు. ఎస్‌ఐ విజయ్‌భాస్కర్‌, తహసీల్దార్‌ రామకో టి, నాయబ్‌ తహసీల్దార్‌ సురేష్‌కుమార్‌, ఎంపీడీవో శ్రీనివాస్‌, ఏవో సుదర్శన్‌గౌడ్‌, ఏ ఈవోలు అభిలాష, మహేష్‌, మానస, ఏపీ ఎం వనితకుమారి, జిల్లా పరిషత్‌ హెచ్‌ఎం నిజాముద్దీన్‌ పాల్గొన్నారు.

మాగనూరు : వజ్రోత్సవాల్లో భాగంగా మంగళవారం మండల కేంద్రంలోని 167 వ జాతీయ రహదారిపై 11.30 గంటలకు సామూహిక జాతీయ గీతాలాపన చేశారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత, ప్రా థమిక పాఠశాలల విద్యార్థులు, యువకులు, వ్యాపారవేత్తలు, వాహనదారులు జాతీయ గీతాలాపలో పాల్గొన్నారు. మండల ప్రత్యేకా ధికారి రాణాప్రతాప్‌, తహసీల్దార్‌ తిరుపత య్య సర్పంచు రాజు, ఉప సర్పంచు సుధ, జడ్పీటీసీ  సభ్యుడు వెంకటయ్య, మాజీ జడ్పీటీసీ సభ్యురాలు సరిత, ఎంపీడీవో సుధాకర్‌రెడ్డి, ఎస్‌ఐ నరేందర్‌, హెచ్‌ఎం నర్సిములు పాల్గొన్నారు.

దామరగిద్ద : వజ్రో త్సవాల్లో భాగంగా సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమాన్ని మంగళవా రం మండలంలోని ఆయా గ్రామాల్లో ఘనంగా జరుపు కున్నారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని అంబే డ్కర్‌ చౌరస్తా దగ్గర ప్రజా ప్రతినిధులు, అధికారులు, యువకులు, ప్రజలు, ఆయా పాఠశాలల విద్యార్థుల ఆధ్వర్యంలో 11:30 గంటలకు జాతీయ గీతా న్ని ఆలపించారు. ఎస్‌ఐ శ్రీనివాస్‌రావు, ఎంపీపీ నర్సప్ప, జడ్పీటీసీ సభ్యురాలు లావ ణ్య, విండో అధ్యక్షుడు ఈదప్ప, మాజీ స ర్పంచ్‌ భీమయ్యగౌడ్‌, కో ఆప్షన్‌ మెంబర్‌ ఉస్మాన్‌, ఎంఈవో వెంకటయ్య, శరణప్ప,  అశోక్‌, కన్కిరెడ్డి పాల్గొన్నారు.

మక్తల్‌ రూరల్‌ : వజ్రోత్సవాల్లో భాగంగా మంగళవారం మండలంలోని జ క్లేర్‌, అనుగొండ, చిట్యాల, ముస్లాయిపల్లి, పంచలింగాల, మాద్వార్‌తో పాటు అన్ని గ్రా మాల్లో విద్యార్థులతో కలిసి ఉదయం 11.30 గంటలకు సామూహిక జాతీయ గీతాలాప న చేశారు. జక్లేర్‌లో జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ వనజ జాతీయ గీతాలాపనలో పా ల్గొన్నారు. ఎంపీడీవో శ్రీధర్‌, ఎంపీవో పావ ని, సర్పంచు నరసింహులు, ఎంపీటీసీ స భ్యురాలు పారిజాత, వేణుగోపాల్‌గౌడ్‌, ఉప సర్పంచు సంగీత, జోవులాపురం సర్పంచు ప్రతాప్‌రెడ్డి పాల్గొన్నారు.

భూత్పూర్‌ రిజర్వాయర్‌పై జెండా ఆవిష్కరణ 

వజ్రోత్సవాల్లో భాగంగా మండలంలోని భూత్పుర్‌ రిజర్వాయర్‌ వద్ద మంగళవారం ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి  50 ఫీట్ల భారీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. సర్పంచు హన్మంతు, రిజర్వాయర్‌, మత్స్య సంఘం చైర్మన్‌ ఆనంద్‌, శేఖర్‌ పాల్గొన్నారు.

మద్దూర్‌ : వజ్రోత్సవాల్లో భాగంగా మద్దూర్‌లో సాయూహిక జాతీయ గీతా లాప చేశారు. ఉదయం 11.30 గంటలకు పాత బస్టాండ్‌లో విద్యార్థులతో పాటు వా హనచోదకులు జాతీయ గీతాన్ని ఆలపించా రు. కొత్తపల్లి, నిడ్జింత, భూనీడ్‌, రెనివట్ల గ్రా మాల్లో గీతాలాప చేశారు. ఎంపీపీ విజయ లక్ష్మి, సర్పంచ్‌ అరుణ, ఎస్‌ఐ సతీశ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

మక్తల్‌ : వజ్రోత్సవాల్లో భాగంగా పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం 11.30 గంటలకు అంబేడ్కర్‌ చౌ రస్తాలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రజా ప్రతినిధులు, పోలీసులు సామూహిక జాతీ య గీతాలాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, ఎంఈవో లక్ష్మీనారాయణ, పుర చైర్‌పర్సన్‌ పావనీ, వైస్‌ చైర్మన్‌ అఖిల, సీఐ సీతయ్య, ఎస్‌ఐ పర్వతాలు, టీఆర్‌ఎస్‌ నాయకులు శ్రీని వాస్‌గుప్తా, మహిపాల్‌రెడ్డి, బీజేపీ నాయకు లు కొండయ్య, కౌన్సిలర్లు అర్చన, కౌసల్య, రాధిక, సత్యనారాయణ, మల్లికార్జున్‌, రతన్‌ కుమార్‌గుప్తా, మొగిలప్ప పాల్గొన్నారు.  

కోస్గి : రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు జాతీయ గీతాలాపన విజయవంతంగా పూర్తయ్యింది. మంగళవారం ఉదయం 11:30 గంటలకు ఎక్కడివారక్కడే జాతీయ గీతాన్ని ఆలపించారు. కోస్గి శివాజీ చౌక్‌లో జాతీయ గీతాలాపనలో ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు పాల్గొని ఐక్యతను చాటారు. అదే విధంగా ఆర్టీసీ బస్టాండ్‌లో పాఠశాల విద్యార్థులు జాతీయ గీతాలాపనలో పాల్గొన్నారు.

ఊట్కూర్‌ :  రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు మంగళవారం 11.30 గంటలకుసామూహిక గీతాలాపన చేశారు. మండల కేంద్రంతో పాటు పెద్దజట్రం, అవుసులోన్‌పల్లి, బిజ్వార్‌, పులిమామిడి, చిన్నపొర్ల, పెద్దపొర్ల, కొల్లూర్‌, తిప్రస్‌పల్లి, అమీన్‌పూర్‌, పగిడిమారి, నిడుగుర్తి గ్రామాల్లో పాఠశాల విద్యార్థులు, యువకులు, గ్రామస్థులు బస్టాండ్‌ సెంటర్‌ర్లలో జాతీయ గీతాలాపాన చేశారు.  








Updated Date - 2022-08-17T04:41:12+05:30 IST