ఉప్పొంగిన ఉత్సాహం

ABN , First Publish Date - 2022-05-28T06:33:48+05:30 IST

తెలుగు తమ్ముళ్లలో ఉత్సాహం ఉ ప్పొంగింది.

ఉప్పొంగిన ఉత్సాహం
నాయకులతో కలిసి మహానాడుకు వస్తున్న ఎమ్మెల్యే గొట్టిపాటి

మహానాడుకు తరలిన తెలుగు తమ్ముళ్లు

 నేటి బహిరంగ సభకు సమాయత్తం

తిరుగు ప్రయాణంలో  మేదరమెట్లలో భోజన వసతి

అద్దంకి, మే 27: తెలుగు తమ్ముళ్లలో ఉత్సాహం ఉ ప్పొంగింది. ఒంగోలులో జరుగుతున్న మహానాడుకు గ్రామాల నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు తర లివెళ్లారు. తొలిరోజు శుక్రవారం జరిగిన టీడీపీ ప్రతి నిధుల సభకు ఎమ్మెల్యే రవికుమార్‌తో పాటు నియో జకవర్గంలోని పలు గ్రామాల నుంచి వందల సంఖ్యలో నాయకులు  వెళ్ళారు. టీడీపీ బాపట్ల పార్లమెంట్‌ టీడీ పీ ఉపాధ్యక్షుడు నాగినేని రామకృష్ణ, అద్దంకి మండల అధ్యక్షుడు కఠారి నాగేశ్వరరావు, కరి పరమేష్‌,  చా గంటి రాజేంద్రప్రసాద్‌, జోన్నలగడ్డ గోపి, అద్దంకి  పట్ట ణ  అధ్యక్షుడు చిన్ని శ్రీనివాసరావు, వడ్డవల్లి పూర్ణచం ద్రరావు, సందిరెడ్డి శ్రీనివాసరావు, కాకాని  అశోక్‌, కూర పాటి వంశీకృష్ణ, కుందారపు  రామారావు, లహరి, మ న్నం త్రిమూర్తులు, రామాంజనేయులు తదితరుల ఆఽ ద్వర్యంలో పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. రెండోరోజు శని వారం  సాయంత్రం 4 గంటలకు జరిగే మహానాడు బహిరంగ సభకు అద్దంకి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి నాయకులు, కార్యకర్తలు భారీగా తరలిరావాలని ఎమ్మెల్యే రవికుమార్‌ పిలుపు నిచ్చారు.  

కాగా, ఈ సభకు అద్దంకి నియోజకవర్గం నుండి పెద్ద సంఖ్యలో నాయకులు,  కార్యకర్తలు తరలివెళ్ళేం దుకు సిద్ధమవుతున్నారు. అన్ని గ్రామాల నుంచి  సొం తంగా ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసుకోవటంతో పాటు, మోటార్‌సైకిళ్లపై వెళ్లేందుకు సిద్ధ్దమవుతున్నా రు. సుమారు 20 వేల నుంచి 25 వేల మంది వరకు  అద్దంకి నియోజకవర్గం నుండి తెలుగు  తమ్ముళ్ళు తర లివెళ్ళే అవకాశం  ఉన్నట్లు  తెలుస్తుంది. తిరుగు ప్ర యాణంలో మేదరమెట్ల వద్ద శనివారం రాత్రికి అద్దంకి నియోజకవర్గ  కార్యకర్తలతో పాటు దూర ప్రాంతం  వెళ్ళే నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్యే రవికుమార్‌ ఆధ్వర్యం లో భోజన  ఏర్పాట్లు చేశారు.  


15 వేల మందికి   భోజన ఏర్పాట్లు

మేదరమెట్ల, మే 27: ఒంగో లులో శనివారం జరిగే బహిరం గ సభకు హాజరై తిరిగి వచ్చే వారికి మేదరమెట్లలో ఎమ్మెల్యే రవికుమార్‌ ఆధ్వర్యంలో భోజ నం ఏర్పాట్లు చేస్తున్నారు. శుక్ర వారం సాయంత్రం మేదరమె ట్లలోని కొండ వద్ద భోజన ఏ ర్పాట్లు చేయనున్న స్థలాన్ని టీడీపీ బాపట్ల పార్లమెంట్‌  అధ్యక్షుడు, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తో కలిసి పరిశీలించారు. సభ అనంతరం తిరిగి వచ్చే టీడీపీ కార్యకర్తలు, ప్రజలకు భోజనాలను ఏర్పాటు చే స్తున్నారు. సుమారు 15 వేల నుంచి 20 వేల మందికి ఇక్కడ భోజనాలు ఏర్పాటుచేస్తున్నారు. మహానాడు నుంచి తిరిగి వెళ్లే వారందరూ ఇక్కడ భోజనం చేయా లని రవికుమార్‌ తెలిపారు. స్థానిక నాయకులతో కలిసి భోజన ఏర్పాట్లు పర్యవేక్షించారు. కార్యక్రమంలో జాగర్ల మూడి జయకృష్ణ, మేదర మెట్ల శ్రీనివాసరావు, సింగ మనేని వాసు, బొల్లేపల్లి సుబ్బారావు, మన్నే ప్రసాద్‌, చెన్ను పాటి హరిబాబు శేష య్య, రేగుల హనుమంత రావు, మందా నాగేశ్వర రా వు, కరి పరమేష్‌, చాగంటి రాజేంద్ర, మారెళ్ల శేషయ్య, కర్నాటి పూర్ణచం ద్రరా వు, రవ్వవరపు బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. 


మేము సైతం.. 

మార్టూరు, మే 27:  ఒంగోలులో జరుగుతున్న మ హానాడు కార్యక్రమానికి నియోజ కవర్గంలోని విభిన్న ప్రతిభావంతులు మార్టూరు నుంచి మూడు చక్రాల వాహనాలపై తరలివెళ్లారు. వెళ్లినవారిలో గద్దె అశోక్‌, వి.వేణు, ఎం. బాలకృష్ణ, వి.రవి, రమేష్‌, సురేష్‌, గురవయ్య, వీరారెడ్డి, గోపి తదితరులు ఉన్నారు. 

అలాగే, మహానాడుకు మార్టూరు, యద్దనపూడి మండలాల నుంచి టీడీపీ నాయకులు తరలివెళ్లారు.  కేవలం పాస్‌లు ఉన్నవారికే అక్క డ ప్రవేశం ఉండటంతో ఎ క్కువమంది నాయకులు మాత్రమే తరలివెళ్లా రు.  శనివారం భారీ బహిరంగ సభ ఉండటంతో నా యకులతో పాటు కార్యకర్తలు కూడా భారీగా తరలి వె ళ్లేందుకు ఏర్పాట్లు చేశారు.

బల్లికురవ: తె లుగు దేశం పార్టీ ఆధ్వర్యంలో ఒంగోలులో జరుగుతున్న మహా నాడుకు బల్లికురవ మండలంలోని అన్నిగ్రామాల నుంచి టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీగా తర లివెళ్లారు. శుక్రవారం ఉదయం నుంచే నేతలు  వాహనాలలో తర లివెళ్లారు. 

 మహా నాడుకు వెళ్లిన వారిలో  కొండేటి ఇజ్రాయల్‌, దూళిపాళ్ల హనుమంతురావు, అడుసుమల్లి నాగశ్రీ హర్ష, అమరనేని కాశీవిశ్వనాధం, మామిళ్లపల్లి ప్రవీణ్‌, ముండ్రు దానయ్య, పావులూరి ఏడుకొండలు, గొట్టి పాటి లక్ష్మయ్య తదితరులు ఉన్నారు.

పంగులూరు: మహానాడు ప్రతినిధుల ప్రారంభ సభకు పంగులూరు మండలం నుంచి వందల సం ఖ్యలో తెలుగుతమ్ముళ్లు తరలివెళ్లారు.  ప్రతినిధుల సభలో  చింతల సహదేవుడు,    మస్తాన్‌వలి, బ్రహ్మా నందస్వామి, బెల్లంకొండ దశరథ, రామలింగస్వామి, కోమటి ప్రసాద్‌ , ఆదిశేఖర్‌, పిచ్చిరెడ్డి, అమృతపూడి ఏసోబు, ఉన్నం రవి పాల్గొన్నారు.  

కాగా, శనివారం సాయంత్రం 3 గంటలకు జరిగే మహానాడు బహిరంగ సభకు పార్టీ కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో తరలి రావాలని ఆ పార్టీ మండల అధ్యక్షుడు రావూరి రమేష్‌, సీనియర్‌ నాయకులు కేవీ సుబ్బారావు, బాలిన రామసుబ్బారావు, కుక్కపల్లి ఏడెకొండలు తదితరులు పిలుపునిచ్చారు. 


బాగా చదువుకోవాలి

మేదరమెట్ల, మే 27: బాగా చదువుకొని ఉన్నత ల క్ష్యాలను సాధించాలని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ తనయుడు మహేష్‌కు మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నా యుడు సూచించారు. శుక్రవారం మహానాడులో వేదికపై ఉన్న ఆయనను రవికుమార్‌,  మహేష్‌ కలిశారు. రవికుమార్‌ తనయు డిని పరిచయం చేయగానే, ఏమి చదువుతున్నావని ప్రశ్నించారు. ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువు తున్నానని చెప్పడంతో, చక్కగా చదువుకొని అభి వృద్ధిలోకి రావాలని మహేష్‌కు సూచిం చారు.

Updated Date - 2022-05-28T06:33:48+05:30 IST