AP News: నారా లోకేష్ అరెస్ట్ - శ్రీకాకుళం జిల్లాలో ఉద్రిక్తత

ABN , First Publish Date - 2022-08-21T22:08:41+05:30 IST

Srikakulam: శ్రీకాకుళం జిల్లా (Srikakulam District) తీవ్ర ఉధ్రిక్తత నెలకొంది. తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh)ను పోలీసులు అరెస్ట్

AP News: నారా లోకేష్ అరెస్ట్ - శ్రీకాకుళం జిల్లాలో ఉద్రిక్తత

Srikakulam: శ్రీకాకుళం  (Srikakulam)జిల్లాలో తీవ్ర ఉధ్రిక్తత నెలకొంది. తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh)ను పోలీసులు అరెస్ట్ చేశారు. పలాసకు వెళ్తున్న లోకేష్‌ను కొత్త రోడ్డు జంక్షన్‌లో అడ్డుకోవడంతో ఆయన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు అడ్డుకోవటాన్ని నిరసిస్తూ రోడ్డుపైనే ఆందోళనకు దిగారు. తరువాత లోకేష్‌ను అరెస్ట్ చేసి రణస్థలం స్టేషన్‌కు తరలించారు. లోకేష్ తోపాటు కొంతమంది టీడీపీ నేతలను (TDP Leaders)  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  ఆ తరువాత విశాఖ విమానాశ్రయానికి తరలించారు.  

వివాదానికి కారణం ఏంటంటే...

శుక్రవారం అర్థరాత్రి సమయంలో.. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో ఇళ్ల కూల్చివేతతో వివాదం మొదలైంది. దాదాపు 40 ఏళ్లుగా నివాసం ఉంటున్నవారి ఇళ్లను కూలుస్తామనడం వివాదానికి దారితీసింది. 40 ఏళ్లు లేని అభ్యంతరం ఇప్పుడు ఏంటని..? టీడీపీకి ఓట్లు వేశారనే కారణంతోనే తమ ఇళ్లు కూల్చేస్తున్నారని స్థానికులు నిరసనకు దిగారు. నోటీసులు ఇవ్వకుండా ఎలా కూలుస్తారని వారు అధికారులను నిలదీశారు.

Updated Date - 2022-08-21T22:08:41+05:30 IST