ఢిల్లీలో తీవ్రమైన వడగాలులు

ABN , First Publish Date - 2022-04-27T18:16:10+05:30 IST

దేశ రాజధాని ఢిల్లీలో సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నారు. ఉష్ణోగ్రత అంతకంతకూ ..

ఢిల్లీలో తీవ్రమైన వడగాలులు

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నారు. ఉష్ణోగ్రత అంతకంతకూ పెరుగుతోంది. బుధవారంనాడు వడగాలుల తీవ్రత మరింత పెరగవచ్చని భారత మెటీరియలాజికల్ డిపార్ట్‌మెంట్ (ఐఎండీ) అంచనా వేస్తోంది. ఒక్కరోజే రెండు నుంచి మూడు డిగ్రీల సెల్సియస్ పెరగవచ్చని చెబుతోంది. మంగళవారంనాడు ఉష్ణోగ్రత 40.8 డిగ్రీల సెల్సియస్ నమోదైందని ఢిల్లీ బేస్ స్టేషన్ సఫ్దర్‌జంగ్ అబ్జర్వేటరీ తెలిపింది. బుధవారం 42 డిగ్రీలకు, గురువారం 44 డిగ్రీలకు చేరవచ్చని ఐఎండీ అంచనా వేస్తోంది. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 46 డిగ్రీలకు పెరిగే అవకాశాలు కూడా లేకపోలేదని ఐఎండీ అధికారి ఒకరు తెలిపారు.


ఢిల్లీలో 2017 ఏప్రిల్ 21న అత్యధికంగా 43.2 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా, 1941 ఏప్రిల్ 29న ఆల్‌టైమ్ గరిష్ట ఉష్ణోగ్రతగా 45.6 డిగ్రీలు నమోదైంది. కాగా, శిశువులు, వృద్ధులు, సుదీర్ఘ వ్యాధులతో బాధపడుతున్న వారు ఈ వేసవి వడగాల్పుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఐఎండీ తాజాగా సూచించింది. ఎండలకు దూరంగా ఉండాలని, తేలకపాటి దుస్తులు ధరించాలని, లైట్ కలర్, లూజుగా ఉండే ఉండే దుస్తులు, కాటన్ దుస్తులు కప్పుకోవాలని, తలపై వస్త్రం కానీ, టోపీ కానీ ధరించాలని, గొడుగులు వేసుకోవాలని సూచించింది.

Updated Date - 2022-04-27T18:16:10+05:30 IST