వారు.. రసికులు

ABN , First Publish Date - 2022-08-20T12:26:10+05:30 IST

సాధారణంగా భారత్‌లో పురుషులే ఎక్కువ మందితో వివాహేతర సంబంధాలు నడుపుతారనే భావన ఉంది. కానీ..

వారు.. రసికులు

ఆ 11 రాష్ట్రాల్లో మహిళలకే శృంగార భాగస్వాములు ఎక్కువ


న్యూఢిల్లీ, ఆగస్టు 19: సాధారణంగా భారత్‌లో పురుషులే ఎక్కువ మందితో వివాహేతర సంబంధాలు నడుపుతారనే భావన ఉంది. కానీ.. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎ్‌ఫహెచ్‌ఎస్‌) ఈ అభిప్రాయం తప్పని నిరూపించింది. దేశంలోని 11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పురుషుల కంటే మహిళలే ఎక్కువ మంది శృంగార భాగస్వాములను కలిగి ఉన్నారని తేల్చిచెప్పింది. ఈ జాబితాలో రాజస్థాన్‌ టాప్‌లో ఉందని తెలిపింది. ఈ రాష్ట్రంలో ఒక్కో మహిళ సగటున 3.1 మంది పురుషులతో శృంగార భాగస్వామ్యం కలిగి ఉండగా.. పురుషుల సగటు 1.8 మాత్రమే ఉంది. రాజస్థాన్‌, హరియాణ, చండీగఢ్‌, జమ్ముకశ్మీర్‌, లద్దాక్‌, మధ్యప్రదేశ్‌, అసోం, కేరళ, లక్షద్వీప్‌, పుదుచ్చేరి, తమిళనాడులోని మహిళలకు పురుషులతో పోలిస్తే ఎక్కువ మంది శృంగార భాగస్వాములు ఉన్నారని తేలింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో మాత్రం పురుషులకే ఎక్కువ మంది భాగస్వాములున్నట్టు ఈ సర్వే చెప్పింది. ఏపీలో ఒక్కో పరుషుడికి సగటున 4.7 మంది మహిళలతో సంబంధాలు ఉండగా మహిళల సగటు 1.4గా ఉంది. తెలంగాణలో పురుషుల సగటు 3.0 కాగా, మహిళల సగటు 1.7గా నమోదైంది. 2019-21 మధ్యకాలంలో ఎన్‌ఎ్‌ఫహెచ్‌ఎస్‌ దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 707 జిల్లాల్లో సర్వే నిర్వహించింది. 1.1లక్షల మంది మహిళలు, లక్ష మంది పురుషులు   సర్వేలో పాల్గొన్నారు. ఈ క్రమంలో గత 12 నెలల్లో ఎవరెవరు తమ భాగస్వామితో కాకుండా వేరొకరితో శృంగారంలో పాల్గొన్నారు..?, జీవితకాలంలో ఎవరెవరు ఎంతమందితో శృంగారంలో పాల్గొన్నారు..? వంటి విషయాలను తెలుసుకున్నారు. ఈ సర్వేకు ముందు ఒక ఏడాది కాలంలో తమ భాగస్వామితో మాత్రమే శృంగారంలో పాల్గొన్నామని చెప్పిన మగవారు 4ు మంది ఉంటే.. మహిళల్లో ఈ సంఖ్య 0.5 శాతమే ఉండడం గమనార్హం.

Updated Date - 2022-08-20T12:26:10+05:30 IST