కూరగాయల పంటను పరిశీలిస్తున్న ప్రకృతి వ్యవసాయం అధికారులు
ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్టు మేనేజర్ నాగరాజు
సంబేపల్లె, జనవరి 28: బహు పంట విధా నం ద్వారా రైతులు అదనపు ఆదాయం పొందవచ్చునని ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్టు మేనేజర్ నాగరాజు అన్నారు. శుక్రవారం నారాయణరెడ్డిపల్లె గ్రామం ముదినేనివాండ్లపల్లె వద్ద రైతు భూదేవి సాగు చేసిన వేరుశనగలో ఉల్లి, అలసంద, బెండ, మొటిక తదితర పంటలు సాగు చేయడం వల్ల అదనపు ఆర్థిక ఆదా యం వచ్చిందన్నారు. మోటకట్ల వద్ద సూర్యమండలం ఆకారంలో వివిధ కూరగాయల సాగు విధానం పరిశీలించారు. కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయం సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.