Abn logo
Sep 21 2021 @ 23:25PM

ట్రైనీ కలెక్టర్‌ కార్తీక్‌ విస్తృత పర్యటన

సచివాలయ సిబ్బందితో మాట్లాడుతున్న ట్రైనీ కలెక్టర్‌ కార్తీక్‌

ప్రొద్దుటూరు రూరల్‌, సెప్టెంబరు 21: జిల్లా ట్రైనీ కలెక్టర్‌ కె.కార్తీక్‌ శిక్షణలో భాగంగా మంగళవారం మండలంలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ముందుగా ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లి మండలంలో పరిపాలన విభాగం, నిధుల వినియోగం గురించి ఎంపీడీవో సుబ్రహ్మణ్యంతోపాటు అక్కడున్న అధికారులను అడిగి తెలుసుకున్నారు. రికార్డులను పరిశీలించారు. అనంతరం కొత్తపల్లె గ్రామ పంచాయతీ కార్యాలయానికి వెళ్లి  గ్రామ పరిపాలన, పారిశుధ్యం, నవరత్నాలు అంశాలపై సిబ్బందితో మాట్లాడారు. గ్రామ పంచాయతీ ఆవరణలో జరిగే అన్ని శాఖల ప్రభుత్వ భవన నిర్మాణాలను, అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. ఒకే ఆవరణలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు బాగుందని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి, కార్యదర్శి పుల్లారెడ్డి, వీఆర్వో రామయ్య, వైసీపీ యువనేత కొనిరెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.