ఆయిల్‌ ఫెడ్‌ చైర్మన్‌ పదవీ కాలం పొడిగింపు

ABN , First Publish Date - 2021-07-28T06:32:15+05:30 IST

ఆయిల్‌ఫెడ్‌ రాష్ట్ర చైర్మన్‌ కంచర్ల రామకృష్ణారెడ్డి పదవీ కాలాన్ని సీఎం కేసీఆర్‌ మరో ఏడాది పొడిగించారు. దీంతో ఆయన వరుసగా మూడుసార్లు ఆయిల్‌ఫెడ్‌ చైర్మన్‌గా హ్యాట్రిక్‌ సాధించినట్టయింది.

ఆయిల్‌ ఫెడ్‌ చైర్మన్‌ పదవీ కాలం పొడిగింపు

హ్యాట్రిక్‌ సాధించిన రామకృష్ణారెడ్డి

మోత్కూరు, జూలై 27: ఆయిల్‌ఫెడ్‌ రాష్ట్ర చైర్మన్‌ కంచర్ల రామకృష్ణారెడ్డి పదవీ కాలాన్ని సీఎం కేసీఆర్‌ మరో ఏడాది పొడిగించారు. దీంతో ఆయన వరుసగా మూడుసార్లు ఆయిల్‌ఫెడ్‌ చైర్మన్‌గా హ్యాట్రిక్‌ సాధించినట్టయింది. యాదాద్రిభువనగిరి జిల్లా మోత్కూరు మండలంలోని దత్తప్పగూడెం గ్రామానికి చెందిన రామకృష్ణారెడ్డి, టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం నుంచి పార్టీ పటిష్ఠతకు కృషి చేస్తున్నారు. తుంగతుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గాదరి కిషోర్‌కుమార్‌, ఎంపీగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి డాక్టర్‌ బూర నర్సయ్య గెలుపునకు, ఈ ప్రాంత స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపునకు ఆయన కృషి చేశారు. దీంతో ఆయన సేవలను గుర్తించిన సీఎం కేసీఆర్‌ తొలుత 2018లో రెండేళ్ల కాల వ్యవధితో ఆయిల్‌ఫెడ్‌ రాష్ట్ర చైర్మన్‌గా నియమించారు. 2020లో ఆయన పదవీ కాలం ముగియగా, ఏడాది పొడిగించారు. ఈ నెల 20తో రెండోసారి ఆయన పదవీ కాలం ముగిసింది. దీంతో ఇటీవల సీఎం కేసీఆర్‌ను ఎమ్మెల్యే కిషోర్‌     కుమార్‌తో ప్రగతి భవన్‌లో కలిసి పదవీకాలాన్ని పొడిగించాలని కోరగా దీనికి ఆయన వెంటనే అంగీకరించారు. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి రఘునందన్‌రావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, తన పదవీ కాలాన్ని పొడిగించిన సీఎం కేసీఆర్‌కు, అందుకు సహకరించిన మంత్రి జగదీ్‌షరెడ్డి, ఎమ్మెల్యే కిషోర్‌కుమార్‌కు రామకృష్ణారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - 2021-07-28T06:32:15+05:30 IST