lockdown నిబంధనలు పొడిగింపు

ABN , First Publish Date - 2022-01-27T15:32:08+05:30 IST

రాష్ట్రంలో కరోనా మూడో అలను నియం త్రించేలా ప్రభుత్వం పలు నిబంధనలు విధించింది. వాణిజ్య సంస్థలు, దుకాణాలు, హోటళ్లు, కర్మాగారాలు

lockdown నిబంధనలు పొడిగింపు

నేడు సీఎం సమీక్ష

చెన్నై/పెరంబూర్‌: రాష్ట్రంలో కరోనా మూడో అలను నియం త్రించేలా ప్రభుత్వం పలు నిబంధనలు విధించింది. వాణిజ్య సంస్థలు, దుకాణాలు, హోటళ్లు, కర్మాగారాలు రాత్రి 10 గంటల వరకు మాత్రమే పనిచేయాలని నిబంధన విధించిన ప్రభుత్వం, రాత్రి 10 నుంచి తెల్లవారు జామున 5 గంటల వరకు లాక్‌డౌన్‌ అమలుకు తెచ్చింది. అలాగే, 9,16,23 తేది (ఆదివారాలు) సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలు చేసింది. అదే సమయంలో శుక్ర, శని, ఆదివారాల్లో ప్రార్థనా స్థలాలకు భక్తుల ప్రవేశాన్ని నిషేధించారు. ఆదివారం నిర్వహించే సంపూర్ణ లాక్‌డౌన్‌పై ప్రతి వారం సీఎం సమీక్షిస్తు న్నారు. ప్రస్తుతం విధించిన నిబంధనలతో కూడిన లాక్‌డౌన్‌ ఈ నెల 31తో ముగియనుంది. ఈ క్రమంలో, లాక్‌డౌన్‌ పొడిగింపుపై గురువారం ఉదయం 11 గంటలకు సచివాలయంలో వైద్యనిపుణులు, పలు శాఖల ఉన్నతాధి కారులతో ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నట్లు సచివాలయం ఒక ప్రకటనలో తెలియజేసింది.

Updated Date - 2022-01-27T15:32:08+05:30 IST