ఐదు రాష్ట్రాల ఎన్నికల ర్యాలీలు, రోడ్‌షోలపై నిషేధం పొడిగింపు

ABN , First Publish Date - 2022-01-17T09:00:31+05:30 IST

వచ్చేనెల నుంచి జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారానికి సంబంధించి ర్యాలీలు, రోడ్‌షోలపై నిషేధాన్ని ఈ నెల 22 వరకు పొడిగిస్తున్నట్లు భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) ప్రకటించింది.

ఐదు రాష్ట్రాల ఎన్నికల ర్యాలీలు,  రోడ్‌షోలపై నిషేధం పొడిగింపు

22 వరకు 50%  సామర్థ్యంతో హాల్‌ మీటింగ్‌లే

న్యూఢిల్లీ, జనవరి 16: వచ్చేనెల నుంచి జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారానికి సంబంధించి ర్యాలీలు, రోడ్‌షోలపై నిషేధాన్ని ఈ నెల 22 వరకు పొడిగిస్తున్నట్లు భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) ప్రకటించింది. భారత ఎన్నికల ప్రధాన కమిషనర్‌ సుశీల్‌ చంద్ర, ఎన్నికల కమిషనర్లు రాజీవ్‌కుమార్‌, అను్‌పచంద్ర పాండేలు శనివారం ఐదు రాష్ట్రాల సీఎ్‌సలు, ఎన్నికల ప్రధానాధికారులతో వర్చువల్‌గా సమావేశమయ్యారు. అనంతరం.. ఈ నెల 15 వరకు ఉన్న నిషేధాజ్ఞలను కొవిడ్‌ ఉధృతి నేపథ్యంలో 22వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ఈసీఐ ప్రకటించింది. వీధుల్లో నిర్వహించే మీటింగ్‌లపైనా నిషేధం ఉంటుందని, అభ్యర్థుల ఇంటింటి ప్రచారంలో కేవలం ఐదుగురికే అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. 


విలేకరులకూ పోస్టల్‌ బ్యాలెట్‌ అవకాశం

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో విలేకరులు, మీడియా ప్రతినిధులకు కూడా పోస్టల్‌ బ్యాలెట్‌ కల్పిస్తూ ఈసీఐ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని పంజాబ్‌ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈవో) డాక్టర్‌ కరుణ రాజు ఆదివారం చండీగఢ్‌లో వెల్లడించారు. అయితే.. పోస్టల్‌ బ్యాలెట్‌కు దరఖాస్తు చేసుకున్నాక.. పోలింగ్‌స్టేషన్లలో ఓటువేసే అవకాశం ఉండదని వివరించారు.

Updated Date - 2022-01-17T09:00:31+05:30 IST