హైదరాబాద్: ఏప్రిల్‌లో జరగనున్న ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర వార్షిక పరీక్షల ఫీజు చెల్లింపును ఇంటర్ బోర్డు పొడిగించింది. ఎలాంటి అపరాధ రుసుము లేకుండా వచ్చే నెల 4వరకు చెల్లించవచ్చని, ఆ తర్వాత రూ.200రుసుముతో వచ్చే10 వరకు, రూ.1000తో 17వరకు, రూ.2వేలతో 24వ తేదీ వరకు చెల్లించవచ్చని ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు. గత ఏడాది అక్టోబరులో ప్రథమ సంవత్సర పరీక్షలు రాసిన ద్వితీయ సంవత్సర రెగ్యులర్ విద్యార్థులు, పాసైన సబ్జెక్టులకు సంబంధించిన బెటర్‌మెంట్ పరీక్షలనూ ఏప్రిల్‌లో రాసుకోవచ్చని ఇంటర్ బోర్డు పేర్కొంది.