ఉపకారవేతనాల దరఖాస్తు గడువు పొడిగింపు

ABN , First Publish Date - 2021-01-24T11:37:53+05:30 IST

కేంద్రప్రభుత్వం అందించే జాతీయ ఉపకారవేతనాలకు దరఖాస్తు గడువును పొడిగించారు. అర్హులైన విద్యార్థులు...

ఉపకారవేతనాల దరఖాస్తు గడువు పొడిగింపు

హైదరాబాద్‌(ఆంధ్రజ్యోతి): కేంద్రప్రభుత్వం అందించే జాతీయ ఉపకారవేతనాలకు దరఖాస్తు  గడువును పొడిగించారు. అర్హులైన విద్యార్థులు http://scholarships.gov.in వెబ్‌సైట్‌ ద్వారా ఈ నెల 31 లోపు దరఖాస్తు చేసుకోవచ్చని ఇంటర్‌ బోర్డు తెలిపింది. ఈ ఉపకార వేతనాలకు అర్హత సాధించిన 52,740 మంది జాబితాను ఇంటర్‌ బోర్డు అధికారిక వెబ్‌సైట్లో ఉంచామని ఇంటర్‌ విద్య కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 

Updated Date - 2021-01-24T11:37:53+05:30 IST