టీకా డోసుల మధ్య కాలవ్యవధి అంశం.. ఆంథోనీ ఫౌచీ కీలక వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2021-06-12T22:09:32+05:30 IST

కరోనా విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రపంచ దేశాలు వ్యాక్సినేషన్‌ను ప్రారంభించాయి. టీకా లభ్యత అధారంగా తొలి, రెండో డోసు మధ్య కాల వ్యవధిని పెంచడమో లేక తగ్గించమో చేస్తూ ప్రజలకు వ్యాక్సిన్‌ను

టీకా డోసుల మధ్య కాలవ్యవధి అంశం.. ఆంథోనీ ఫౌచీ కీలక వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: కరోనా విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రపంచ దేశాలు వ్యాక్సినేషన్‌ను ప్రారంభించాయి. టీకా లభ్యత అధారంగా తొలి, రెండో డోసు మధ్య విరామాన్ని పెంచడమో లేక తగ్గించమో చేస్తూ ప్రజలకు వ్యాక్సిన్‌ను అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తొలి, రెండో డోసుల మధ్య కాల వ్యవధి అంశంపై అమెరికా ప్రముఖ అంటు వ్యాధుల నివారణ నిపుణుడు డాక్టర్ ఆంథోనీ ఫౌచీ కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు డోసుల మధ్య గ్యాప్ ఎక్కువ ఉండటం వల్ల ప్రజలు.. కరోనా వేరియంట్ల బారినపడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్యూలో మాట్లాడిన ఆయన.. ఎంఆర్ఎన్ఏ‌‌తో అభివృద్ధి చేసిన ఫైజర్, మోడెర్నా టీకాలను అమెరికా ప్రజలకు అందిస్తున్న విధానాన్ని వెల్లడించారు. ఫైజర్ టీకా తొలి డోసు తీసుకున్న వారికి.. మూడు వారాల తర్వాత రెండో డోసు ఇస్తున్నట్టు పేర్కొన్నారు. అదే విధంగా మోడెర్నా తీసుకున్న వారికి నాలుగు వారాల తర్వాత రెండో డోసును అందిస్తున్నట్టు వెల్లడించారు. రెండు డోసుల మధ్య కాల వ్యవధిని పెంచడం వల్ల ప్రజలు.. వ్యాప్తిలో ఉన్న కరోనా వేరియంట్ బారినపడే అవకాశం ఉందన్నారు. బ్రిటన్‌లో ఇలానే జరిగిందని ఆయన పేర్కొన్నారు. 


Updated Date - 2021-06-12T22:09:32+05:30 IST