ఏలూరు ఎడ్యుకేషన్, నవంబరు 24 : జవహర్ నవోదయ విద్యాలయాల్లో 6, 9 తరగతుల్లో ప్రవేశాలకు నిర్వహించే ప్రవేశ పరీక్షలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే గడువు తేదీని డిసెంబరు 15వ తేదీ వరకూ పొడిగించినట్టు డీఈవో రేణుక తెలిపారు. 6వ తరగతి ప్రవేశపరీక్ష వచ్చే ఏడాది ఏప్రిల్ 10న, 9వ తరగతి ప్రవేశపరీక్ష 13న జరుగుతాయన్నారు. ఎక్కువ మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకునేలా చూడాలని హెచ్‌ఎంలను ఆదేశించారు. మరిన్ని వివరాలకు జవహర్ నవోదయ విద్యాలయ ప్రతినిధి మెహర్‌కృష్ణను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.