కరాచీ: పాకిస్థాన్ దేశంలోని కరాచీ నగరంలో జరిగిన పేలుడులో ఒకరు మరణించగా, మరో 10 మందికి పైగా గాయపడ్డారు.కరాచీలోని ఖరదర్ ప్రాంతంలోని బాంబే బజార్లో సోమవారం సాయంత్రం పేలుడు సంభవించింది. ఈ పేలుడులో గాయపడిన వారిని పోలీసులు, రెస్క్యూ అధికారులు ఆసుపత్రికి తరలించారు.పేలుడు జరిగిన ప్రాంతం చుట్టూ జనసాంద్రత ఎక్కువగా ఉందని పోలీసులు చెప్పారు.గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు కరాచీ అడ్మినిస్ట్రేటర్ తెలిపారు. అయితే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు.పేలుడుకు ఖచ్చితమైన కారణం ఇంకా గుర్తించనప్పటికీ, పేలుడు పరికరం వల్ల పేలుడు సంభవించి ఉంటుందని స్థానికులు చెప్పారు.
అంతకుముందు మే 12 వతేదీన సద్దర్ ప్రాంతంలో జరిగిన బాంబు పేలుడులో ఒకరు మరణించగా,మరో 13 మంది గాయపడ్డారు.కరాచీ యూనివర్శిటీలో ఏప్రిల్ చివరిలో జరిగిన ఆత్మాహుతి దాడిలో ముగ్గురు చైనీస్ ఉపాధ్యాయులు ఒక స్థానికుడు మరణించిన మూడు వారాల తర్వాత మళ్లీ పేలుడు సంభవించింది.
ఇవి కూడా చదవండి