Advertisement
Advertisement
Abn logo
Advertisement

తరచూ శృంగారం చేసేవారికి, వారానికొకసారి పాల్గొనే వారికి అసలు తేడా ఇదే.. వైద్యులు చెబుతున్న షాకింగ్ నిజాలు..!

ప్రేమకు, శృంగారానికి అవినాభావ సంబంధం ఉంటుంది. సంసారంలో భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు బలంగా ఉంటే ఆ కుటుంబం కలకాలం సంతోషంగా ఉంటుంది. ఆర్థికపరమైన అంశాల్లో సమస్యలు వచ్చినప్పుడు సామరస్యంగా పరిష్కరించుకోవాలి.. అలాగే శృంగార విషయంలోనూ దంపతుల మధ్య సఖ్యత ఉండాలంటున్నారు వైద్య నిపుణులు. శృంగారం అంటే రెండు శరీరాలను ఒక చోటికి చేర్చే ప్రక్రియలా కాకుండా.. స్త్రీపురుషులిద్దరినీ మానసికంగా కూడా దగ్గరకు చేర్చే ప్రక్రియగా భావించాలని చెబుతున్నారు. భార్యభర్తల మధ్య ప్రేమ ఉన్నప్పుడే.. శృంగారంలోని అనుభూతిని ఆస్వాదించవచ్చని సూచిస్తున్నారు. శృంగారం చేయడం ద్వారా పలు రకాల ప్రయోజనాలు ఉన్నాయని పలు పరిశోధనల్లో తేలింది. తరచూ శృంగారం చేసేవారికి, వారానికొకసారి పాల్గొనే వారికి తేడా ఉంటుందట.

ఆరోగ్యంగా ఉంటేనే ఎక్కువ కాలం జీవించగలం. ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ వ్యాయమం చేస్తూ చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి. అయితే శృంగారం ద్వారా మానసిక ఒత్తిడి తగ్గడంతో పాటూ పలు ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. ప్రేమానురాగాలతో కూడుకున్న శృంగారం.. వ్యాయామంగానూ ఉపకరిస్తుందట. తరచూ శృంగారం చేయడం ద్వారా గుండె ఆరోగ్యంగా ఉంటుందట.


వారానికి ఒకటి కంటే తక్కువ సార్లు శృంగారంలో పాల్గొనే వారితో పోలిస్తే.. వారానికి ఒకటి, రెండు సార్లు పాల్గొనే వారి లాలాజలంలో ఇమ్యునోగ్లోబులిన్ ఏ(ఐజీఏ) మోతాదు అధికంగా ఉంటుందని అధ్యయనంలో తేలింది. రోగనిరోధక వ్యవస్థ పనితీరులో ఈ ఏజీఏ కీలకపాత్ర పోషిస్తుందట. ఉదయం పూట శృంగారంలో పాల్గొనడం వల్ల ఆక్సిటోసిన్ అనే హార్మోన్ విడుదల అవుతుంది. తద్వారా భాగస్వామిపై ప్రేమ పెరుగుతుందట. ప్రస్తుత జీవన విధానంలో పని ఒత్తిడి కారణంగా యాంత్రికంగా పాల్గొంటున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. శృంగార జీవితాన్ని మరింత ఆసక్తిగా మార్చుకునేందుకు కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవాలని సూచిస్తున్నారు.

చేపలు, సోయా వంటివి తీసుకోవడం ద్వారా సెక్స్ హార్మోన్ల మోతాదు పెరుగుతుంది. అలాగే అరటిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది పురుషాంగానికి కావాల్సినంత శక్తిని అందిస్తుందట. చాలా సేపు శృంగారంలో పాల్గొనే శక్తి లభిస్తుంది. బంగాళదుంపలోని గుణాలు లైంగిక శక్తిని పెంపొందిస్తాయని చెబుతున్నారు. గుమ్మడికాయ విత్తనాలు తీసుకోవడం వల్ల మెదడులో సెరోటోనిన్ ఉత్పత్తికి సాయపడే ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లాన్ని ఉత్పత్తి చేసేందుకు సహాయపడుతుంది. తద్వారా శృంగారంలో మరింత శక్తిని ఇస్తుందట. 

అదేవిధంగా పలుచటి ప్రొటీన్లతో కూడిన కోడి మాంసంలో టైరోసైన్, ఫినైల్‌అలనైన్ ఉంటుంది. ఇవి శృంగారంపై ఆసక్తిని పెంపొందిస్తాయి. తక్కువ కొవ్వు ఉండే పెరుగు, గుడ్లలో కొలైన్ ఉంటుంది. ఇది కూడా శృంగార కాంక్షను పెంపొందిస్తుంది. పండ్లు, పొట్టుతీయని ధాన్యాలు తీసుకోవడం ద్వారా ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. అలాగే నట్స్, పిస్తా, వేరుశెనగ తదితరాలు చాలా మేలు చేస్తాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement