30కిపైగా వ్యాక్సిన్‌ కేండిడేట్లతో ప్రయోగాలు : కేంద్రం

ABN , First Publish Date - 2020-09-17T08:08:28+05:30 IST

దేశంలో 30కిపైగా కరోనా వ్యాక్సిన్‌ కేండిడేట్లతో ప్రయోగ పరీక్షలు జరుగుతున్నాయని, వాటికి సహకారం అందిస్తున్నామని కేంద్రం ప్రక టించింది...

30కిపైగా వ్యాక్సిన్‌ కేండిడేట్లతో ప్రయోగాలు : కేంద్రం

న్యూఢిల్లీ, సెప్టెంబరు 16: దేశంలో 30కిపైగా కరోనా వ్యాక్సిన్‌ కేండిడేట్లతో ప్రయోగ పరీక్షలు జరుగుతున్నాయని, వాటికి సహకారం అందిస్తున్నామని కేంద్రం ప్రక టించింది. మూడు అడ్వాన్స్‌డ్‌ (1, 2, 3) ట్రయల్‌ దశల్లో ఉండగా, మరో నాలుగు అడ్వాన్స్‌డ్‌ ప్రీ-క్లినికల్‌ దశలో ఉన్నాయని  కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద్‌ రాయ్‌ బుధవారం రాజ్యసభకు తెలిపారు. ప్రస్తుతం కరోనా చికిత్సకై ఔషధాలను గుర్తించేందుకు 13 క్లినికల్‌ ట్రయల్స్‌ కొనసాగుతున్నాయని వెల్లడించారు. కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ నిర్వహణను పర్యవేక్షించేందుకు ఆగస్టు 7న నీతి ఆయోగ్‌ పరిధిలో జాతీయ నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

Updated Date - 2020-09-17T08:08:28+05:30 IST