సరికొత్త అనుభూతికి సిద్ధమా?

ABN , First Publish Date - 2020-07-22T05:30:00+05:30 IST

ఈ ఏడాది యువత ఆసక్తిగా ఎదురుచూస్తున్న బైక్‌ ‘జావా పెరక్‌’. వారి నిరీక్షణకు ఇక తెరపడినట్టే. ‘క్లాసిక్‌ లెజెండ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ నుంచి వస్తున్న ఈ బైక్‌ డెలివరీలను సంస్థ ఇటీవలే ప్రారంభించింది...

సరికొత్త అనుభూతికి సిద్ధమా?

ఈ ఏడాది యువత ఆసక్తిగా ఎదురుచూస్తున్న బైక్‌ ‘జావా పెరక్‌’. వారి నిరీక్షణకు ఇక తెరపడినట్టే. ‘క్లాసిక్‌ లెజెండ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ నుంచి వస్తున్న ఈ బైక్‌ డెలివరీలను సంస్థ ఇటీవలే ప్రారంభించింది. ఫ్యాక్టరీ కస్టమ్‌ మేడ్‌గా రూపుదిద్దుకున్న ‘పెరక్‌’లో కుర్రకారుకు నచ్చే ఫీచర్లన్నీ ఉన్నాయంటోంది. వారికి సరికొత్త అనుభూతినిస్తుందంటోంది సంస్థ. 


ఇవీ ఫీచర్లు... 

  1. బీఎస్‌-6 ప్రమాణాలు కలిగిన ‘జావా పెరక్‌’... భారత దేశపు మొట్టమొదటి ఫ్యాక్టరీ కస్టమ్‌ బైక్‌.
  2. 334సీసీ లిక్విడ్‌ కూల్డ్‌, సింగిల్‌ సిలిండర్‌, 4-స్ట్రోక్‌, డీఓహెచ్‌సీ ఇంజన్‌ దీని ప్రత్యేకత.
  3. 30.64 పీఎస్‌ శక్తిని, 32.74 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. లాక్‌డౌన్‌ సమయాన్ని సద్వినియోగం చేసుకుని మరీ టార్క్‌ను దాదాపు 2ఎన్‌ఎం వరకూ వృద్ధి చేశామని, అత్యధిక టార్క్‌ ఎక్కువగా లాగే శక్తిని, రోలింగ్‌ యాక్సిలరేషన్‌ అందిస్తుందని సంస్థ చెబుతోంది.
  4. అలాగే రైడింగ్‌ మరింత సౌకర్యంగా ఉండేలా గేర్‌ రేషియో కూడా మార్చారు. 6 గేర్లు ఇందులో ఉన్నాయి.
  5. ఛాసి్‌సతో పాటు సరికొత్త స్వింగ్‌ఆర్మ్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే టాన్‌ కలర్డ్‌ సింగిల్‌ సీట్‌, బ్లాక్డ్‌ ఔట్‌ ఇంజిన్‌, స్పోక్‌ వీల్స్‌ మరో ఆకర్షణ.
  6. ఈ బైక్‌కు సింగిల్‌ సీట్‌ మాత్రమే ఉంటుంది. దీని స్వింగ్‌ ఆర్ట్‌ డిజైన్‌ కారణంగా వెనుక సీటు అమర్చుకునే అవకాశాలు తక్కువ.
  7. ‘జావా పెరక్‌’ ధర రూ.1.94 లక్షలు (ఎక్స్‌షోరూమ్‌, ఢిల్లీ).
  8. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ క్లాసిక్‌ 350కు ఇది పోటీ కావొచ్చని అంచనా.


జావా పెరక్‌ 

ప్రత్యేకతలు: 

తొలి ఫ్యాక్టరీ కస్టమ్‌ బైక్‌. 334 సీసీ లిక్విడ్‌ కూల్డ్‌ సింగిల్‌ సిలిండర్‌ ఇంజన్‌, 6-గేర్‌, సింగిల్‌ సీట్‌. ధర: రూ.1.94 లక్షలు (ఎక్స్‌ షోరూమ్‌, ఢిల్లీ) 

Updated Date - 2020-07-22T05:30:00+05:30 IST