‘ఆసరా’ కోసం ఎదురుచూపులు

ABN , First Publish Date - 2021-12-02T06:14:47+05:30 IST

ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి పేరు పోనకంటి కైలా సం...వయస్సు 59 సంవత్సరాలు...బుగ్గారం మం డల కేంద్రానికి చెందిన వ్యక్తి...ప్రభుత్వం ఇటీవల ఆసరా వృద్ధాప్య పింఛన్‌ వయస్సును 57 ఏళ్లకు తగ్గించడంతో ఆశలు చిగురించి పింఛ న్‌ కోసం మీ సేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకున్నాడు..

‘ఆసరా’ కోసం ఎదురుచూపులు

జిల్లాలో 41, 334 మంది దరఖాస్తులు ఫముందుకు సాగని ప్రక్రియ

జగిత్యాల, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి పేరు పోనకంటి కైలా సం...వయస్సు 59 సంవత్సరాలు...బుగ్గారం మం డల కేంద్రానికి చెందిన వ్యక్తి...ప్రభుత్వం ఇటీవల ఆసరా వృద్ధాప్య పింఛన్‌ వయస్సును 57 ఏళ్లకు తగ్గించడంతో ఆశలు చిగురించి పింఛ న్‌ కోసం మీ సేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకున్నాడు.. ఇప్పటివరకు అధికారులు పరిశీలన, విచారణకు సైతం రాకపోవడంతో అతడికి ఎదురుచూపులే మిగిలాయి. ఇది ఒక కైలాసం సమస్య కాదు.. జిల్లాలో వేల సంఖ్యలో వృద్ధా ప్య పింఛన్‌ కోసం దరఖాస్తు చేసుకున్న వాకి పరిస్థితి. 

జిల్లాలో పరిస్థితి.

జిల్లాలో ప్రస్తుతం 2.07 లక్షల మంది వృద్ధులు, వితంతులు, దివ్యాం గులు, చేనేత, గీత కార్మిక, బీడీ కార్మిక, ఒంటరి మహిళలు, బోధకాల బాధితులకు పింఛన్లను అందిస్తున్నారు. ప్రతీ నెల రూ. 43.46 కోట్ల సొ మ్మును పింఛన్లకు ప్రభుత్వం కేటాయిస్తోంది. గతంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం వృద్ధాప్య పింఛన్‌ను ప్రభుత్వం రూ. వెయ్యి నుంచి రూ. 2,016కు పెంచింది. జిల్లాలో 57 ఏళ్లు నిండిన వ్యక్తులు సుమారు 25 వేల మంది ఉన్నట్లు ప్రాథమికంగా అధికారులు అంచనా వేశారు. అ యినప్పటికీ జిల్లాలో భారీ సంఖ్యలో పింఛన్ల కోసం దరఖాస్తులు వచ్చాయి.

దరఖాస్తులు ఇలా...

జిల్లాలో ఆసరా పింఛన్ల కోసం 41,334 దరఖాస్తులు చేసుకున్నారు.  ఇందులో బీర్‌పూర్‌లో 969 మంది, బుగ్గారంలో 946, దర్మపురిలో 1,696, గొల్లపల్లిలో 1,521, ఇబ్రహీంపట్నంలో 1,471, జగిత్యాలలో 3,165, జగి త్యాల రూరల్‌ మండలంలో 2,569, కథలాపూర్‌లో 3,464, కొడిమ్యాలలో 1,792, కోరుట్లలో 7,132 మంది ఉన్నారు. మల్లాపూర్‌లో 2,034 మంది, మల్యాలలో 1,877, మేడిపల్లిలో 3,558, మెట్‌పల్లిలో 2,740 మంది, పెగడపల్లిలో 1,354, రాయికల్‌లో 2,773, సారంగపూర్‌లో 992 మంది, వెల్గటూరులో 1,281 మంది దరఖాస్తులు చేసుకున్నారు.

అర్హత గుర్తింపు ఇలా...

2018 అసెంబ్లీ ఎన్నికల మెనిఫెస్టోలో అధికార టీఆర్‌ఎస్‌ వృద్ధాప్య అర్హత వయస్సు 57 యేళ్లకు కుదిస్తామని హామీనిచ్చింది. హామీ మేరకు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకులు వృద్ధాప్య అర్హత వయస్సును తగ్గించాలని డిమాండ్‌ చేయగా అందుకు అనుగుణంగా అర్హత వయస్సును మీసేవా కేంద్రాల ద్వారా దరఖాస్తుకు అవకాశం కల్పించి మార్గదర్శ కాలను జారీ చేసింది. దరఖాస్తుదారుని వయస్సు గుర్తింపు పత్రం, కు టుంబ సభ్యుల వయస్సు ఆధారంగా లబ్ధిదారుని వయస్సును అంచనా వేస్తున్నారు. మూడు ఎకరాల్లోపు తరి, 7.5 ఎకరాల్లోపు మెట్లభూమి గల వారు పట్టణ ప్రాంతాల్లో రూ. 2 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ. 1.5 లక్షల లోపు ఆదాయం గల వ్యక్తులు అర్హులుగా గుర్తిస్తున్నట్లు అధి కా రులు అంటున్నారు. ప్రభుత్వ, ప్రయివేటు ఉద్యోగాలు, కాంట్రాక్టు ఉద్యో గాలు చేస్తున్న పిల్లలు ఉన్న వృద్ధులు అనర్హులుగా పేర్కొంటున్నారు. లబ్ధిదారు డికి సొంత దుకాణం గాని, సంస్థలు ఉండకూడదని, కుటుం బంలో ఒకరికి మాత్రమే ఆసరా పింఛన్‌ను మంజూరు చేయనున్నారు. తనిఖీ అధికారులు పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు. 

జరగని దరఖాస్తుల పరిశీలన, విచారణ...

జిల్లాలో వేల సంఖ్యలో ఆసరా పథకం కింద వృద్ధాప్య పింఛన్‌ పొం దడానికి దరఖాస్తులు చేసుకున్నప్పటికీ అధికారులు ఇప్పటివరకు కనీ సం దరఖాస్తుల పరిశీలన, విచారణ ప్రారంభించలేదు. 2019 సంవత్స రం నుంచి ఇప్పటివరకు అర్హులైన 65 సంవత్సరాలు పైబడిన వ్యక్తు లు, ప్రభుత్వం ఇటీవల అవకాశం కల్పించిన విధంగా 57 సంవత్స రా లు పైబడిన వ్యక్తులు దరఖాస్తులు సమర్పించి ఎదురుచూపులతో గ డుపుతున్నారు. దరఖాస్తులు స్వీకరించి నెల రోజులు గడుస్తున్నప్పటికీ పరిశీలన సైతం జరగకపోవడంతో నిరుత్సాహానికి గురవుతున్నారు. అ ర్హులను గుర్తించే ప్రాథమిక కసరత్తులను అధికారులు చేస్తున్నారు. దర ఖాస్తు దారుల్లో చాల మంది తిరస్కరణకు గురయ్యే అవకాశాలున్నట్లు అధికారులు అంటున్నారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఎలాంటి ఆదేశా లు రాకపోవడంతో దరఖాస్తుల ప్రక్రియ ‘ఎక్కడ వేసిన గొంగలి’ అక్కడే చందంగా మారింది. తమ దరఖాస్తులు ఎప్పుడు పరిశీలన చేస్తారో... క్షేత్ర స్థాయిలో విచారణ ఎప్పుడు జరుగుతుందో...అర్హులను ఎప్పుడు గు ర్తిస్తారో తెలియక వృద్దులు ఎదురుచూపులతో గడుపుతున్నారు.

Updated Date - 2021-12-02T06:14:47+05:30 IST