ఏడేళ్లుగా ఎదురుచూపులు..

ABN , First Publish Date - 2022-05-07T11:01:05+05:30 IST

జిల్లాలో ఖరీఫ్‌, రబీ సీజన్‌లో వరి, వేరుశనగ, బుడ్డశనగ, పత్తి, జొన్న, పెసర సజ్జ, కొర్రతదితర పంటలు సుమారు 4 లక్షల హెక్టార్లలో సాగు చేస్తుంటారు. పంటను బట్టి ఎకరాకు రూ.40 వేల నుంచి లక్ష దాకా సాగు పెట్టుబడి పెడుతుంటారు. అప్పులు తెచ్చి పంటల సాగు చేస్తుంటారు. అయితే

ఏడేళ్లుగా ఎదురుచూపులు..

రూ.155 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ కోసం నిరీక్షణ  

లక్షా 51 వేల మంది రైతులను నట్టేట ముంచిన ప్రభుత్వం


మాది రైతు ప్రభుత్వం అంటూ సొంత డబ్బా కొట్టుకుంటారు. కులం చూడం, మతం చూడం, పార్టీ చూడమని గొప్పలు చెప్పుకుంటారు. ఇవన్నీ చెప్పేదానికి, సొంత మీడియాలో పేజీలు పేజీలు ప్రకటనలు ఇచ్చుకోవడానికి మాత్రమే సరిపోతుందే తప్ప రియల్‌ గా మాత్రం రైతులకు న్యాయం జరగలేదు. ఏడాది, రెండేళ్లు కాదు.. ఏడేళ్లుగా దెబ్బతిన్న పంటలకు ఇన్‌పుట్‌ సబ్సిడీ కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. కేవలం టీడీపీ హయాంలో అనే నెపంతో ఆ కాలానికి సంబంధించి ఇన్‌పుట్‌ సబ్సిడీ ప్రస్తుత ప్రభుత్వం ఇవ్వలేదనే అభియోగాలు ఉన్నాయి. వెరసి రూ.150 కోట్ల పరిహారం కోసం 1,51,380 మంది రైతులు నిరీక్షిస్తున్నారు. సహాయం కోసం పలుమార్లు ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారి గోడు వినే నాధుడే లేడు. ఇన్‌పుట్‌  సబ్సిడీ వస్తే కనీసం సాగు పెట్టుబడి కోసం తెచ్చిన అప్పులకు వడ్డీ కట్టుకోవచ్చనే ఆశలో రైతులు ఉన్నారు.


(కడప-ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఖరీఫ్‌, రబీ సీజన్‌లో వరి, వేరుశనగ, బుడ్డశనగ, పత్తి, జొన్న, పెసర సజ్జ, కొర్రతదితర పంటలు సుమారు 4 లక్షల హెక్టార్లలో సాగు చేస్తుంటారు. పంటను బట్టి ఎకరాకు రూ.40 వేల నుంచి లక్ష దాకా సాగు పెట్టుబడి పెడుతుంటారు. అప్పులు తెచ్చి పంటల సాగు చేస్తుంటారు. అయితే ప్రకృతి వైపరిత్యాలు రైతులను కోలుకోలేని విధంగా దెబ్బతీస్తున్నాయి. జిల్లాలో రైతాంగం ప్రతి ఏటా అనావృష్టి, అతివృష్టి కారణంగా పంటలు దెబ్బతిని అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.


ఇన్‌పుట్‌ సబ్సిడీ ఏదీ..

2015 నుంచి 2019 మధ్య తీవ్ర దుర్భిక్షం, అకాల వర్షాలు ఉమ్మడి జిల్లాల్లో రైతులను కోలోకోలేని విధంగా దెబ్బతీశాయి. 2015 మే నెలలో కురిసిన అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. వరి, కొర్ర, కంది, చామంతి, ఇతర పంటలు దెబ్బతిన్నాయి. అప్పట్లో 5 మండలాల్లో 277 మందికి చెందిన 209 హెక్టార్లలో పంట దెబ్బతింది. రూ.2 కోట్లు ఇన్‌పుట్‌ సబ్సిడీ ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది. అదే ఏడాది నవంబర్‌లో భారీ వర్షాలు రైతులను మరోసారి దెబ్బతీశాయి. మొక్కజొన్న, ప్రొద్దుతిరుగుడు, బు డ్డశనగ, ఆముదం, కంది తదితర పంటలు 39వేల 66 హెక్టార్లలో దెబ్బతి నగా 4815 మంది రైతులకు సుమారు రూ.44 కోట్ల పరిహారం రావాల్సి ఉంది. 

- 2018 సంవత్సరం ఖరీ్‌ఫలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. సాగులో ఉన్న వేరుశనగ, పత్తి, సజ్జ, కంది, వరి, మొక్కజొన్న, చామంతి, మినుముపంటలు నిలువునా ఎండిపోయాయి. 22 మండలాల్లో 11191 హెక్టార్లలో పంట దెబ్బతింది. 25540 మంది రైతులకు రూ.15 కోట్ల మేర ఇన్‌పుట్‌  సబ్సిడీ రావాల్సి ఉంది. 

- 2018-19 రబీలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. 32 మండలాల్లో తీవ్ర ప్రభావం చూపింది. పెసలు, మినుము, శనగ, వేరుశనగ, ప్రొద్దుతిరుగుడు, సజ్జ, మొక్కజొన్న, చాంమంతి దెబ్బతింది.  97 వేల 11 హెక్టార్లు దెబ్బతింది. 88753 మంది రైతులకు రూ.95 కోట్ల మేర ఇన్‌పుట్‌ సబ్సిడీ అందాల్సి ఉంది.


ఎప్పుడిస్తారు?

టీడీపీ హయాంలో పనులు చేపట్టారన్న ఉద్దేశ్యంతో నీరు-చెట్టు, ఉపాధి హామీ పథకం బిల్లులు నిలిపేశారు. టెండర్‌ ఖరారు అయిన పలు కాం ట్రాక్టు పనులను రద్దు చేశారు. అలాగే టీడీపీ హయాంలోనే పంటలు దెబ్బతిని రైతులకు నష్టం జరిగిందన్న ఉద్దేశ్యంతో ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వకుండా జాప్యం చేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాల్సిన బాధ్యత ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే వారిపై ఉంటుంది. జగన్‌ సర్కార్‌ అధికారంలోకి వచ్చి మూడేళ్లు అయింది. పంటలు దెబ్బతిన్నప్పుడు సకాలంలోనే ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. మరి గత ప్రభుత్వ హయాంలో దెబ్బతిన్న రైతులకు ఎందుకు పరిహారం ఇవ్వలేదంటూ రైతులు, రైతు సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. 

Read more