బకాయిల కోసం ఎదురుచూపులు..!

ABN , First Publish Date - 2022-01-18T04:36:54+05:30 IST

ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను పెద్ద ఎత్తున చేపట్టినప్పటికీ ఆ ధాన్యం కొనుగోలు ప్రక్రియలో పాలు పంచుకున్న ఏజెన్సీలకు మాత్రం ఇప్పటివరకు కమీషన్‌లను చెల్లించకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొనుగోళ్ల కోసం అధికారులు విధించిన లక్ష్యాన్ని అధిగమించేందుకు ఏజెన్సీలు రాత్రింబవళ్లు శ్రమించాయి. ముఖ్యంగా ఐకేపీ పరిధిలో పొదుపు సంఘాల మహిళలు ఈ కొనుగోలు ప్రక్రియలో ఎక్కువగా శ్రయించారు. అయితే, 2021 ఖరీఫ్‌, రబీ సీజన్‌లకు సంబంధించిన కమీషన్‌ డబ్బులను ఇప్పటివరకు ప్రభుత్వం చెల్లించలేదంటున్నారు. దాదాపు రూ. 42.48 కోట్లకు పైగా బకాయి సొమ్ము సంబంధిత ఏజెన్సీలకు చెల్లించాల్సి ఉందంటున్నారు.

బకాయిల కోసం ఎదురుచూపులు..!
జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి కార్యాలయం ఇదే

ధాన్యం కొనుగోలు నిధుల కోసం తిప్పలు  

రూ.42.48 కోట్ల బకాయిలపై స్పందించని సర్కారు 

ఏడాది గడుస్తున్నా ఇప్పటి వరకు చర్యలు కరువు

నిర్మల్‌, జనవరి 17 (ఆంద్రజ్యోతి): ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను పెద్ద ఎత్తున చేపట్టినప్పటికీ ఆ ధాన్యం కొనుగోలు ప్రక్రియలో పాలు పంచుకున్న ఏజెన్సీలకు మాత్రం ఇప్పటివరకు కమీషన్‌లను చెల్లించకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొనుగోళ్ల కోసం అధికారులు విధించిన లక్ష్యాన్ని అధిగమించేందుకు ఏజెన్సీలు రాత్రింబవళ్లు శ్రమించాయి. ముఖ్యంగా ఐకేపీ పరిధిలో పొదుపు సంఘాల మహిళలు ఈ కొనుగోలు ప్రక్రియలో ఎక్కువగా శ్రయించారు. అయితే, 2021 ఖరీఫ్‌, రబీ సీజన్‌లకు సంబంధించిన కమీషన్‌ డబ్బులను ఇప్పటివరకు ప్రభుత్వం చెల్లించలేదంటున్నారు. దాదాపు రూ. 42.48 కోట్లకు పైగా బకాయి సొమ్ము సంబంధిత ఏజెన్సీలకు చెల్లించాల్సి ఉందంటున్నారు. 

నిర్మల్‌ జిల్లాలో 2020-21లో.. 

నిర్మల్‌ జిల్లాలో 2020 - 2021 ఖరీఫ్‌ సీజన్‌కు గాను మొత్తం 82,939 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఈ సీజన్‌లో ఐకేపీతో పాటు డీసీఎంఎస్‌, తదితర ఏజెన్సీలు ఈ ధాన్యాన్ని కొనుగోలు చేశాయి. మొత్తం అన్ని ఏజెన్సీలకు కలిపి రూ.2.65 కోట్ల కమీషన్‌ డబ్బులను అప్పటి ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి చెల్లించాల్సి ఉంది. రబీ సీజన్‌లో 1.82.372 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. దీనికి సంబంధించి అన్ని ఏజెన్సీలకు రూ.5.83 కోట్లను చెల్లించాల్సి ఉంది. 2021-22 ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి ఇప్పటివరకు 1.29 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా ఈ దాన్యానికి సంబంధించిన కమీషన్‌ డబ్బులు రూ. 42.48 కోట్ల వరకు ఉన్నాయంటున్నారు. రూ.4 కోట్లను కూడా అధికారులు ఇప్పటి వరకు రైతులకు చెల్లించలేదని వాపోతున్నారు. ధాన్యాన్ని అమ్ముకున్న రైతులకు డబ్బులను చెల్లించడం లేదన్న ఆరోపణలున్నాయి. ఇలా రూ.30 కోట్ల బకాయిలు ఉన్నట్లు అధికారులే పేర్కొంటున్నారు. మొత్తం 42.48  కోట్ల రూపాయల బకాయిలను ఎప్పటిలోగా చెల్లిస్తారోననే అంశంపై స్పష్టత కరువైందని పేర్కొంటున్నారు. ఇటు ధాన్యం కొనుగోలు ఏజెన్సీలు, అటు రై తులు బకాయిలను చెల్లించాలని అధికారుల చుట్టూ కాళ్లు అరిగెలా తిరుగుతున్నా స్పందన కనిపించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

రైతుల చెల్లింపులపై పెదవి విరుపు..

ధాన్యం అమ్ముకున్న రైతులకు సైతం ప్రభుత్వం పూర్తిస్థాయిలో చెల్లింపులు జరపలేదన్న ఆరోపణలున్నాయి. సాంకేతిక కారణాలు అలాగే నివేదిక ల్లో తప్పిదాల కారణంగా రైతులకు సంబంధించిన రూ.30 కోట్ల చెల్లింపులు జరగనట్లు చెబుతున్నారు. ప్రభుత్వం ధాన్యం అమ్మిన రైతులందరికీ ఎప్పటికప్పుడు వారి ఖాతాల్లో డబ్బులను జమ చేస్తామంటూ హామీ ఇస్తున్నప్పటికీ కొంతమందికి చెల్లింపులు సజావుగా జరిపి మరికొంతమంది రైతుల ఊసెత్తడం లేదంటున్నారు. ఇలా రూ. 30 కోట్ల పై చిలుకు బకాయిలను రైతులకు చెల్లించాల్సి ఉన్నప్పటికీ ఇప్పటి వరకు సంబంధిత అధికారుల నుంచి ఎలాంటి స్పందన కనిపించడం లేదన్న ఫిర్యాదులున్నాయి. బకాయిల చెల్లింపుల విషయమై పలువురు రైతులు ఇప్పటికే మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి అలాగే కలెక్టర్‌ దృష్టికి కూడా తీసుకుపోయారు. 

ఏజెన్సీలకు మొండిచేయి..

కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసే సమయంలో ఏజెన్సీలకు ఆశలు చూ పిన అధికారులు ఆ తర్వాత పట్టించుకోవడం లేదంటున్నారు. 2020-21 నుంచి నాలుగు సీజన్‌ల కొనుగోలు కమీషన్‌ బకాయిలను చెల్లించకుండా వెట్టి చాకిరి చేయిస్తున్నారన్న ఫిర్యాదులున్నాయి. కొనుగోలు సమయంలో అ ధికారులు, రైతుల నుంచి ఎన్నో రకాల ఒత్తిళ్లను ఎదుర్కొన్నామని, తమకు అండగా నిలిచి ఆదుకోవాల్సిన ప్రభుత్వం విరుద్ధంగా వ్యవహరిస్తుందంటూ ఏజెన్సీ నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2021 ఖరీఫ్‌ సీజన్‌కు గా ను 2.65 కోట్లు, అదే సంవత్సరం రబీ సీజన్‌కు గాను రూ.5.83 కోట్లను త మకు కమీషన్‌ రూపంలో బకాయిలు రావాల్సి ఉందంటున్నారు. 2021-22 ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి రూ. 4 కోట్ల వరకు బకాయిలు తమకు చెల్లించాల్సి ఉందని ఏజెన్సీలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే తమ బకాయిలు చె ల్లింపుల విషయమై ఉన్నతాధికారులకు, ప్రజాప్రతినిధులకు విన్నవించినప్పటికీ ఎలాంటి చర్యలు కనిపించడం లేదని వారు పేర్కొంటున్నారు.  

ఆరంభ శూరత్వం..

ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసే సమయంలో సంబంధిత శాఖల అధికారులు ఏజెన్సీలకు అనేక రకాల హా మీలు ఇస్తున్నారంటున్నారు. ముఖ్యం గా కమీషన్‌ డబ్బులను ఎప్పటికప్పుడు చెల్లిస్తామని, కొనుగోలు కేం ద్రాల్లో అన్ని రకాల సౌకర్యాలను సమకూరుస్తామని అలాగే కొనుగోలు చే సిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు తరలించి ఒత్తిడి లేకుండా చేస్తామని అధికారులు ఏజెన్సీలకు హామీనిచ్చా యి. ఆచరణలో మాత్రం ఎక్కడా ఈహామీ అమలు కాకపోవడంతో ఏ జెన్సీలు రైతుల నుంచి కిందిస్థా యి అధికారుల నుంచి తీవ్ర ఒత్తిళ్ల కు గురయ్యాయంటున్నారు. ఇలా ఓవైపు ఒత్తిళ్లతో పాటు మరోవైపు ప్రకృతి వైపరీత్యాలతో తాము ఇక్కట్ల పాలయ్యామంటూ ఏజె న్సీలు వా పోతున్నాయి. బకాయిలను చెల్లించి ఆ దుకోవాలని కోరుతున్నాయి. 

Updated Date - 2022-01-18T04:36:54+05:30 IST