కేంద్రం నిర్ణయంతో ఆందోళన చెందుతున్న ప్రవాసులు

ABN , First Publish Date - 2021-02-23T06:31:17+05:30 IST

భారత్‌లో కరోనా కొత్త స్ట్రెయిన్ కేసులు బయటపడటంతో కేంద్రం అప్రమత్తమై విదేశాల నుంచి వచ్చే వారికి కొత్త

కేంద్రం నిర్ణయంతో ఆందోళన చెందుతున్న ప్రవాసులు

దుబాయి: భారత్‌లో కరోనా కొత్త స్ట్రెయిన్ కేసులు బయటపడటంతో కేంద్రం అప్రమత్తమై విదేశాల నుంచి వచ్చే వారికి కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. సోమవారం రాత్రి 12 గం. నుంచి ఈ మార్గదర్శకాలు అమలులోకి రానున్నాయి. కొత్త మార్గదర్శకాల ప్రకారం విదేశాల నుంచి వచ్చే ప్రయాణీకులు గడిచిన మూడు రోజుల్లో చేయించుకున్న కొవిడ్-19 ఆర్టీ పీసీఆర్ టెస్ట్ రిపోర్ట్‌ను ఎయిర్ సువిదా పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. కొవిడ్-19 రిపోర్ట్ నెగిటివ్ అని వస్తేనే భారత్‌లో అడుగు పెట్టేందుకు అనుమతి ఉంటుంది. అయితే పెద్దవారితో పాటు పసిపిల్లలకు కూడా కొవిడ్-19 రిపోర్ట్ తప్పనిసరి చేయడంపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. 


ముఖ్యంగా గల్ఫ్ దేశాల నుంచి వచ్చే వారు కేంద్ర నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమ బిడ్డ వయసు కేవలం మూడు నెలలు మాత్రమే అని, కొవిడ్-19 టెస్ట్‌కు పసిబిడ్డను తీసుకెళ్తే ఇన్‌ఫెక్షన్ సోకే ప్రమాదం ఉందంటూ దుబాయిలో స్థిరపడ్డ ఓ భారతీయ జంట ఆందోళన వ్యక్తం చేస్తోంది. వచ్చే గురువారం తాము భారత్‌కు రానున్నామని, కేంద్రం నిర్ణయంతో పసిబిడ్డను టెస్ట్‌కు తీసుకువెళ్లాల్సి వస్తోందని చెప్పుకొచ్చారు. ఇతర దేశ ప్రభుత్వాలు ఆరేళ్ల లోపు పిల్లలకు కొవిడ్-19 రిపోర్ట్ అడగడం లేదని, భారత్ కూడా ఈ విధానాన్నే అనుసరించాలని కోరుతున్నారు. అయితే, వైద్యులు మాత్రం పసిబిడ్డలకు టెస్ట్ చేయించాలంటే ముందుగా అపాయింట్‌మెంట్ తీసుకుంటే మంచిదని సలహా ఇస్తున్నారు.   

Updated Date - 2021-02-23T06:31:17+05:30 IST