Kuwait: కొత్తగా వచ్చే ప్రవాసులకు వీసా విషయమై కువైత్ కొత్త షరతు.. ఇకపై అందులో విఫలమైతే వెనక్కి..

ABN , First Publish Date - 2022-09-25T15:48:36+05:30 IST

గల్ఫ్ దేశం కువైత్ (Public Authority for Manpower) గడిచిన కొంతకాలంగా వలసదారులకు ఇచ్చే అన్ని రకాల వీసాలకు కఠిన నిబంధనలు అమలు చేస్తున్న విషయం తెలిసిందే.

Kuwait: కొత్తగా వచ్చే ప్రవాసులకు వీసా విషయమై కువైత్ కొత్త షరతు.. ఇకపై అందులో విఫలమైతే వెనక్కి..

కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్ (Public Authority for Manpower) గడిచిన కొంతకాలంగా వలసదారులకు ఇచ్చే అన్ని రకాల వీసాలకు కఠిన నిబంధనలు అమలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మరో కొత్త షరతును తెరపైకి తెచ్చింది. ఇకపై కువైత్‌కు వచ్చే కొత్త ప్రవాసులకు వీసాలు జారీ చేసే ముందు వారు ఏ ఉద్యోగం కోసం వచ్చారో అందులో చేయాల్సిన పనిలో నైపుణ్యత, నాలెడ్జ్ టెస్టు ఉంటుందని పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్ (Public Authority for Manpower) డైరెక్టర్ జనరల్ డా. ముబారక్ అల్ అజ్మీ వెల్లడించారు. కువైత్ సోసైటీ ఆఫ్ ఇంజినీర్స్ (KSE) సహకారంతో ప్రవాసులకు ఈ టెస్టు నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. 


ఇక మొదటి దశలో కేవలం కువైత్‌కు కొత్త వచ్చే ప్రవాసులకు మాత్రమే వీసా జారీ చేసే ముందు టెస్టు నిర్వహిస్తామన్నారు. ఆ తర్వాత రెండో దశలో ప్రస్తుతం దేశంలో ఉంటున్న ప్రవాసులు ఎవరైతే వర్క్ పర్మిట్ల రెన్యువల్ కోసం వస్తారో వారికి కూడా టెస్టు ఉంటుందన్నారు. వర్క్ పర్మిట్‌ల పునరుద్ధరణ, జారీ కోసం ఈ టెస్టు ఒక తప్పనిసరి షరతుగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ టెస్టులో విఫలమైన వ్యక్తి దేశం విడిచి వెళ్లిపోవాల్సి ఉంటుంది. అలా దేశం విడిచి వెళ్ళడానికి గ్రేస్ పీరియడ్ ఇవ్వడం జరుగుతుందని డా. ముబారక్ అల్ అజ్మీ తెలిపారు. త్వరలోనే దీనిపై పూర్తి సమాచారంతో ప్రకటన ఉంటుందన్నారు.

Updated Date - 2022-09-25T15:48:36+05:30 IST