సోషల్ మీడియాలో పరిచయమైన మహిళను.. ఇంటికి ఆహ్వానించిన అరబ్ వ్యక్తికి ఊహించని షాక్..

ABN , First Publish Date - 2020-02-19T17:01:20+05:30 IST

సోషల్ మీడియా ద్వారా పరిచమైన మహిళను శృంగారం కోసం తన ఇంటికి ఆహ్వానించిన అరబ్ వ్యక్తికి ఊహించని ఘటన ఎదురైంది.

సోషల్ మీడియాలో పరిచయమైన మహిళను.. ఇంటికి ఆహ్వానించిన అరబ్ వ్యక్తికి ఊహించని షాక్..

అజ్మన్: సోషల్ మీడియా ద్వారా పరిచమైన మహిళను శృంగారం కోసం తన ఇంటికి ఆహ్వానించిన అరబ్ వ్యక్తికి ఊహించని ఘటన ఎదురైంది. వ్యక్తి ఆహ్వానం మేరకు ఆఫ్రికన్ మహిళ(34) తన స్నేహితురాలితో కలిసి అతని ఇంటికి వెళ్లింది. అనంతరం ఇద్దరు కలిసి అరబ్ వ్యక్తిని బంధించి అతని వద్ద ఉన్న 2700 దిర్హామ్స్(రూ.52వేలు)తో పాటు క్రెడిట్, డెబిట్ కార్డులు తీసుకొని అక్కడి నుంచి ఉడాయించారు. తాజాగా ఈ కేసు అజ్మన్ క్రిమినల్ కోర్టులో విచారణకు వచ్చింది. విచారణలో దోషిగా తేలిన ఆఫ్రికన్ మహిళకు న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. కాగా, ఆమెకు సహకరించిన మరో మహిళ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు సమాచారం. 


వివరాల్లోకి వెళ్తే... అజ్మన్‌లో ఉండే అరబ్ వ్యక్తికి సోషల్ మీడియా ద్వారా ఓ ఆఫ్రికన్ మహిళతో పరిచయం ఏర్పడింది. దాంతో ఇద్దరు రెండు రోజుల పాటు వాట్సాప్‌లో చాటింగ్ చేసుకున్నారు. ఈ క్రమంలో అరబ్ వ్యక్తి మహిళకు భారీగా డబ్బు ఆశచూపి తనతో శృంగారంలో పాల్గొనాల్సిందిగా ఆఫర్ చేశాడు. దానికి అంగీకరించిన సదరు మహిళ అతను ఉంటున్న అపార్ట్‌మెంట్‌కు వెళ్లింది. ఆ సమయంలో తనతో పాటు మరో మహిళను కూడా తీసుకెళ్లింది. ఇద్దరు కలిసి వ్యక్తి ఇంట్లోకి వెళ్లి అతడ్ని బెడ్‌కు కట్టేశారు.


అనంతరం అతని పర్సులో ఉన్న రూ. 52వేలు తీసుకున్నారు. అలాగే క్రెడిట్, డెబిట్ కార్డులు కూడా తీసుకొని వాటి పిన్ నెంబర్లు చెప్పాలని కత్తులతో బెదిరించారు. పిన్ నెంబర్లు తీసుకొని ఇద్దరు అక్కడి నుంచి పరారయ్యారు. వారు వెళ్లిపోయిన తర్వాత బాధితుడు అల్ హమదియా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు వాట్సాప్ చాటింగ్, అపార్ట్‌మెంట్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన సీసీటీవీ దృశ్యాల ఆధారంగా ప్రధాన నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. మరో మహిళ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. తాజాగా నిందితురాలిని అజ్మన్ క్రిమినల్ కోర్టులో హాజరుపరిచారు. విచారణలో తన నేరాన్ని అంగీకరించిన నిందితురాలికి న్యాయస్థానం జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది.     

Updated Date - 2020-02-19T17:01:20+05:30 IST