Visa fee: ప్రవాస కార్మికులకు ఒమన్‌ గుడ్‌న్యూస్..!

ABN , First Publish Date - 2022-03-15T15:00:32+05:30 IST

ప్రవాస కార్మికులకు ఒమన్ గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రవాస కార్మికుల నియామకాలకు సంబంధించి లైసెన్స్‌ల జారీ, రెన్యువల్ వీసా ఫీజులను 85 శాతం వరకు తగ్గించింది.

Visa fee: ప్రవాస కార్మికులకు ఒమన్‌ గుడ్‌న్యూస్..!

మస్కట్: ప్రవాస కార్మికులకు ఒమన్ గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రవాస కార్మికుల నియామకాలకు సంబంధించి లైసెన్స్‌ల జారీ, రెన్యువల్ వీసా ఫీజులను 85 శాతం వరకు తగ్గించింది. ఈ మేరకు ప్రభుత్వ సేవల విభాగం ఆదివారం కీలక ప్రకటన చేసింది. ఒమనైజేషన్ రేట్లకు కట్టుబడి ఉన్న కంపెనీల కోసం ప్రవాస శ్రామిక శక్తి రుసుములను 89 శాతానికి పైగా తగ్గించినట్లు తన ప్రకటనలో పేర్కొంది. ప్రవాస కమర్షియల్ మ్యాన్‌పవర్ రిక్రూట్‌మెంట్ కోసం లైసెన్స్‌ల జారీ, పునరుద్ధరణకు తాజాగా సవరించిన రుసుములు ఇలా ఉన్నాయి..


ఫస్ట్ క్లాస్: రెండు సంవత్సరాలకు గాను 2001 ఒమనీ రియాళ్లుగా(రూ.3.97లక్షలు) ఉన్న ఫీజును 301 ఒమనీ రాయాళ్లకు(రూ.59వేలు) తగ్గించింది. అలాగే ఒమనైజేషన్‌కు కట్టుబడి ఉన్న సంస్థలు కేవలం 211 ఒమనీ రియాళ్లు(రూ.41వేలు) చెల్లిస్తే సరిపోతుంది. 

సెకండ్ క్లాస్: 601-1001 ఒమనీ రియాళ్లుగా ఉన్న రుసుమును 251 ఒమనీ రియాళ్లకు(రూ.49వేలకు) తగ్గించింది. ఇక ఒమనైజేషన్‌కు కట్టుబడి ఉన్న కంపెనీలు 176 ఒమనీ రియాళ్లు(సుమారు రూ.35వేలు) కడితే చాలు.

థర్డ్ క్లాస్: 301-361 ఒమనీ రియాళ్లుగా ఉన్న రుసుమును 201 ఒమనీ రియాళ్లకు(సుమారు రూ.40వేలు) తగ్గించింది. అలాగే ఒమనైజేషన్ పాలసీకి కట్టుబడి ఉండే కంపెనీలు కేవలం 141 ఒమనీ రియాళ్లు(రూ.28వేలు) చెల్లిస్తే సరిపోతుంది.  

Updated Date - 2022-03-15T15:00:32+05:30 IST