Abn logo
Sep 21 2021 @ 15:52PM

Dubai లో ఓ ప్రవాసుడు.. Girlfriend తో కలిసి చేసిన నిర్వాకానికి 5 ఏళ్ల జైలు.. రూ. 4లక్షల జరిమానా..

దుబాయ్: గల్ఫ్ దేశాల్లో చట్టాలు చాలా కఠినంగా ఉంటాయనే విషయం తెలిసిందే. ముఖ్యంగా డ్రగ్స్, మద్యం విషయంలో ఆ దేశాలు చాలా కఠినంగా వ్యవహరిస్తాయి. ఇక డ్రగ్స్‌తో పట్టుబడితే అంతే సంగతులు. గతేడాది ఇలాగే ఓ ప్రవాసుడు దుబాయ్‌లో డ్రగ్స్‌తో పట్టుబడ్డాడు. విశ్వసనీయ సమాచారం ప్రకారం తనిఖీలు నిర్వహించిన నార్కోటిక్ అధికారులకు సదరు వ్యక్తి నివాసంలో గంజాయి దొరికింది. సోదాల కోసం ఆ వ్యక్తి ఇంటికి వెళ్లిన సమయంలో అతని గర్ల్‌ఫ్రెండ్ డ్రగ్స్ సేవించినట్లు అధికారులు గుర్తించారు. దాంతో సదరు వ్యక్తిని అధికారులు దుబాయ్ పోలీసులకు అప్పగించారు. తాజాగా ఈ కేసు దుబాయ్ క్రిమినల్ కోర్టులో విచారణకు వచ్చింది. దీంతో దోషిగా తేలిన ప్రవాసుడికి న్యాయస్థానం 5 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.4లక్షల జరిమానా కూడా విధించింది. 


ఇవి కూడా చదవండి..

Kuwait కు వలస వెళ్లిన మనోళ్లు.. నెలకు ఎంత సంపాదిస్తారో తెలుసా..?

ఆ రెండు దేశాల వారికి e-visas లు ఇచ్చేది లేదన్న India..



కోర్టులో పేర్కొన్న వివరాల ప్రకారం.. గతేడాది ఫిబ్రవరిలో దుబాయ్ నార్కోటిక్ పోలీస్ విభాగానికి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి దుబాయ్‌లోని పామ్ ఐల్యాండ్ ప్రాంతంలో ఉండే యూరప్‌కు చెందిన ఓ ప్రవాసుడు తన ఇంట్లో డ్రగ్స్ కలిగి ఉన్నట్లు సమాచారం అందింది. దాంతో డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అడ్మినిస్ట్రేషన్‌తో కలిసి నార్కోటిక్ సిబ్బంది సదరు వ్యక్తి ఇంట్లో సోదాలు నిర్వహించాయి. ఆ సమయంలో యూరోపియన్ వ్యక్తి ఇంట్లో గంజాయి దొరికింది. అంతేగాక అతనితో కలిసి ఉన్న ఓ మహిళను మత్తులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దాంతో మహిళను విచారించిన అధికారులు ఆమె గంజాయి సేవించినట్లు తేల్చారు. దాంతో అధికారులు ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిపై కేసు నమోదు చేసి కటకటాల్లోకి నెట్టారు. తాజాగా ఈ కేసు దుబాయ్ క్రిమినల్ కోర్టులో విచారణకు వచ్చింది. విచారణలో దోషిగా తేలిన యూరోప్ వ్యక్తికి న్యాయస్థానం 5 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అలాగే రూ.4లక్షల జరిమానా చెల్లించాలని, శిక్ష కాలం పూర్తైన వెంటనే దేశం విడిచిపెట్టి వెళ్లిపోవాలని ఆదేశించింది. అలాగే మహిళను ప్రత్యేక కోర్టుకు సిఫార్సు చేసింది.       

ఇవి కూడా చదవండిImage Caption