విస్తరణ చేపట్టారు.. నిర్మాణం మరిచారు

ABN , First Publish Date - 2022-07-03T05:28:38+05:30 IST

మున్సిపల్‌ పరిధిలో పలు ప్రాం తాల్లో అంతర్గత రోడ్లు అధ్వానంగా ఉన్నాయి.

విస్తరణ చేపట్టారు.. నిర్మాణం మరిచారు
మొండిగోడలు, గతుకులమయంగా ఉన్న పచ్చతోరణంవారి వీధి

 అధ్వానంగా అంతర్గత రహదారులు

 ఇబ్బందులు పడుతున్న ప్రజలు

చీరాల, జూన్‌ 2: మున్సిపల్‌ పరిధిలో పలు ప్రాం తాల్లో అంతర్గత రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధనాంగా గత కౌన్సిల్‌ హయాంలో స్వర్ణ రోడ్డు నుంచి నల్ల గాంధీ బొమ్మ సెంటర్‌ వరకు ఉన్న పచ్చతోరణాలవారివీధిని విస్తరణ పేరుతో అడ్డంకులను తొలగించారు. కొందరు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించారని వారి ఇళ్లను కొంత మేర తొలగించారు. ఆక్రమంలో అప్పటి మున్సిపల్‌ చై ర్మన్‌ మోదడుగు రమేష్‌బాబు మాట్లాడుతూ ఆక్రమ ణల తొలగించిన వెంటనే కొత్తగా రోడ్డు, డ్రయినేజిని నిర్మిస్తామని స్థానికులకు చెప్పారు.  దీంతో ఎక్కడన్నా ఒకరిద్దరు విస్తరణకు నిరాకరించినవారు కూడా చైర్మ న్‌ మాటలతో అంగీకరించారు. ఆ తరువాత పరిస్థితు లు మారాయి. నూతన కౌన్సిల్‌ చైర్మన్‌గా జంజనం శ్రీనివాసరావు పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఎమ్మె ల్యేగా కరణం బలరామకృష్ణమూర్తి గెలుపొందారు. 

ఈ నేపథ్యంలో తమ వీధిలో వెంటనే రోడ్డు నిర్మి స్తారని ఆ ప్రాంత ప్రజలు భావించారు. వారి ఆశలు అడియాశలయ్యాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలవుతున్నా ఆ రోడ్డు, డ్రైయి న్లు నిర్మాణం మాత్రం పూర్తి కాలేదు. ఆ రోడ్డులో వర్షా ల సమయంలో స్థానికులతో పాటు వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ రోడ్డులో సుమారు 8 కుటుంబాలవారు రెక్కాడితేకాని డొక్కాడ ని గుమస్తాలు. వారిలో ఒకరిద్దరు డ్రైయిన్లు పూర్త యితే ఆక్రమణల తొలగింపులోపోను మిగిలిన కొద్దిపా టి ఇంటిని సరిచేసుకుందామని భావించారు.  డ్రైయి న్లు నిర్మాణం కాకపోవటంతో వారి ఇళ్ల వద్ద తా త్కాలికంగా మురుగుకాలువ పై కర్రెల వంతెన ఏర్పా టుచేసుకున్నారు. మురుగుతో దోమకాటు పెరుగుతుం ది. దీంతో ఎక్కడ వ్యాధుల బారిన పడతామోనని ఆ ప్రాంతవాసులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికై నా పాలకులు, అధికారులు స్పందించి ఆ రోడ్డు, ఇరు వైపులా డ్రైయిన్లు వెంటనే నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. ఇతర అంతర్గత రోడ్లులో కూడా డ్రైయి న్లు నిర్మాణం పూర్తిచేసి వచ్చే వర్షాకాలంలో ఇబ్బంది లేకుండా చూడాలని పురప్రజలు కోరుతున్నారు.


కొత్తపేటలో అస్తవ్యస్తంగా డ్రైనేజీ

కొత్తపేట(చీరాల), జూలై 2: కొత్తపేట పంచాయతీ పరిధిలో అస్త వ్యస్తంగా డ్రైనేజీ ఉంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చీరాలకు కూతవేటు దూరంలో  ఈ గ్రామం ఉంది.  గ్రామ పరిధిలో డ్రైునే జీ వ్యవస్థ కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఉంది. దీంతో మిగిలిన ప్రాంతాల్లో చిన్నపాటి వర్షం కురిసినా రోడ్లు చెరువులవుతుంటాయి. ఆ సమయంలో వాహనచో దకులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొం టున్నారు. డ్రైనేజీ నిర్మాణానికి సంబంధించి ఆయా ప్రాంతాల ప్రజలు అనేకమార్లు పాలకులు, అధికారు లకు వినతిపత్రాలు అందజేశారు. అవి బుట్టదాఖల య్యాయి. 

ఈ నేపథ్యంలో ఒకటి, రెండు చోట్ల ప్రధాన రహదారుల వెంట కూడా డ్రైనేజీ నీరు రోడ్లుపైకి వస్తుంది. ఇది ఇబ్బందికరంగా మారింది. ప్రస్తుతం వర్షాలు మొదలయ్యాయి. చిన్నపాటి వర్షంకురిసినా పలు ప్రాంతాల్లో రోడ్లు పల్లంగా ఉన్న ప్రదేశాల్లో నీరు నిల్వఉంటుంది. దీంతో పాదచారులు వెళ్లేసమయంలో వాహనచోదకులు ఆ నిల్వనీరు ఉన్న ప్రదేశాల్లో కూడా వేగంగా వెళ్లటంతో పాదచారులు, కొన్నిచోట్ల స్కూల్‌ విద్యార్థులపై ఆ నీరు చిందిన సంఘటనలు ఉన్నాయి. ఈ ఘటనలు కొన్ని సందర్భాల్లో వివాదాలకు దారితీస్తున్నాయి. 

ఇదిలాఉంటే పల్లంగా ఉన్న ప్రదేశాల్లో నీరు నిల్వ ఉండటంతో అవి దోమలకు ఆవాసాలుగా మారుతు న్నాయి. వాతావరణ మార్పులు జరిగే సమయంలో సీజనల్‌ వ్యాధులు వస్తుంటాయి. పాలకులు, అధికారు లు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్థు లు కోరుతున్నారు.

Updated Date - 2022-07-03T05:28:38+05:30 IST