రూ.100 కోట్లతో రాధా స్మెల్టర్స్‌ విస్తరణ

ABN , First Publish Date - 2021-12-03T07:33:25+05:30 IST

టీఎంటీ బార్లను విక్రయిస్తున్న రాధా స్మెల్టర్స్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోనుంది. ప్రస్తు తం 4 లక్షల టన్నులున్న ఉత్పత్తి సామర్థ్యాన్ని 2025 నాటికి 10 లక్షల టన్నులకు పెంచుకోవాలని భావిస్తున్నట్లు.

రూ.100 కోట్లతో రాధా స్మెల్టర్స్‌ విస్తరణ

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): టీఎంటీ బార్లను విక్రయిస్తున్న రాధా స్మెల్టర్స్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోనుంది. ప్రస్తు తం 4 లక్షల టన్నులున్న ఉత్పత్తి సామర్థ్యాన్ని 2025 నాటికి 10 లక్షల టన్నులకు పెంచుకోవాలని భావిస్తున్నట్లు.. ఇందుకోసం రూ.75 కోట్ల నుంచి రూ.100 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు రాధా స్మెల్టర్స్‌ చైర్మన్‌ సునీల్‌ సరాఫ్‌ తెలిపారు. మార్కెట్లోకి కొత్తగా 550డీ ఎల్‌ఆర్‌ఎఫ్‌ టీఎంటీ బార్స్‌ను విడుదల చేసిన సందర్భంగా మాట్లాడారు. 550డీ టీఎంటీ బార్లను మౌలిక సదుపాయాలు, భారీ బిల్డింగ్‌ ప్రాజెక్టుల్లో వినియోగిస్తారు.  వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ.1500 కోట్ల టర్నోవర్‌ను నమోదు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సునీల్‌ చెప్పారు. 

Updated Date - 2021-12-03T07:33:25+05:30 IST