హైదరాబాద్‌లో ఎయిర్‌క్రాఫ్ట్‌ ఇంజన్స్‌ యూనిట్‌ విస్తరణ!

ABN , First Publish Date - 2021-04-17T06:34:13+05:30 IST

హైదరాబాద్‌లో సంస్థ కార్యకలాపాలను విస్తరిస్తున్నట్లు ఫ్రాన్స్‌కు చెందిన ఎయిర్‌క్రాఫ్ట్‌, ఏరోస్పేస్‌ కాంపోనెంట్‌ తయారీ సంస్థ సాఫ్రాన్‌ ఎలక్ర్టికల్‌ అండ్‌ పవర్‌ వెల్లడించింది

హైదరాబాద్‌లో ఎయిర్‌క్రాఫ్ట్‌ ఇంజన్స్‌ యూనిట్‌ విస్తరణ!

వెల్లడించిన సాఫ్రాన్‌ ఎలక్ర్టికల్‌  మూడో త్రైమాసికంలో ప్రారంభం  కేటీఆర్‌తో సంస్థ ప్రతినిధుల భేటీ


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో సంస్థ కార్యకలాపాలను విస్తరిస్తున్నట్లు ఫ్రాన్స్‌కు చెందిన ఎయిర్‌క్రాఫ్ట్‌, ఏరోస్పేస్‌ కాంపోనెంట్‌ తయారీ సంస్థ సాఫ్రాన్‌ ఎలక్ర్టికల్‌ అండ్‌ పవర్‌ వెల్లడించింది. ఇందులో భాగంగా ఈ ఏడాది (2021) మూడో త్రైమాసికంలో విస్తరించిన ఎయిర్‌క్రాఫ్ట్‌ ఇంజన్‌ కేంద్రాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. శుక్రవారం నాడిక్కడ తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కే తారక రామారావుతో  సాఫ్రాన్‌ సంస్థ ఛైర్మన్‌ రాస్‌ మెకిన్సీస్‌, సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అలెగ్జాండర్‌ జిగ్లర్‌, సాఫ్రాన్‌ ఇండియా ఎండీ పియరీ డికెల్లీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎయిర్‌క్రాఫ్ట్‌ విడి భాగాల తయారీలో పేరొందిన తమ సంస్థ హైదరాబాద్‌లోని ఎయిర్‌క్రాఫ్ట్‌ ఇంజన్‌ ఫెసిలిటీని మరింతగా విస్తరించనున్నట్లు వారు తెలిపారు. సాఫ్రాన్‌.. 2018లో హైదరాబాద్‌లో తన కార్యకలాపాలను ప్రారంభించింది. ప్రస్తుతం హైదరాబాద్‌ ప్లాంట్‌లో ఏరో ఇంజన్‌ వైర్‌ హార్‌నెస్సెస్‌, ఇంటర్‌ కనెక్షన్‌ సిస్టమ్‌ ఫర్‌ లీప్‌ (లీడింగ్‌ ఎడ్జ్‌ ఏవియేషన్‌ ప్రొపల్షన్‌) ఇంజన్స్‌, ఫెడెక్‌ (ఫుల్‌ అథారిటీ డిజిటల్‌ ఇంజన్‌ కంట్రోల్‌), రాఫెల్‌ ప్రొగ్రామ్స్‌ను ఉత్పత్తి చేస్తోంది. 

Updated Date - 2021-04-17T06:34:13+05:30 IST