బాలికపై భూతవైద్యుడి దాడి.. అరెస్టు

ABN , First Publish Date - 2022-04-03T18:19:48+05:30 IST

భూతవైద్యం పేరుతో బాలికను దారుణంగా కొట్టడంతోపాటు, కాల్చి గాయాలు చేసిన ఘటనలో భూతవైద్యుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన ఝార్ఖండ్‌లోని చాత్రా జిల్లాలో జరిగింది.

బాలికపై భూతవైద్యుడి దాడి.. అరెస్టు

భూతవైద్యం పేరుతో బాలికను దారుణంగా కొట్టడంతోపాటు, కాల్చి గాయాలు చేసిన ఘటనలో భూతవైద్యుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన ఝార్ఖండ్‌లోని చాత్రా జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చాత్రా జిల్లాకు చెందిన పద్నాలుగేళ్ల బాలిక.. హోలీ పండుగ తర్వాత అనారోగ్యం పాలైంది. దీంతో బాలిక తల్లిదండ్రులు దెయ్యం సోకిందేమోననే అనుమానంతో మౌలానా వాహిద్ అనే భూతవైద్యుడికి చూపించారు. అతడు బాలికకు దెయ్యం పట్టిందని, అది వదలాలంటే తను చెప్పినట్లు చెయ్యాలని నమ్మించాడు. తర్వాత నాలుగు రోజులపాటు అనేక క్షుద్రపూజలు నిర్వహించాడు. ఈ క్రమంలో బాలికను దారుణంగా కొట్టాడు. ముఖం, పెదవులు, చేతులపై కాల్చి వాతలు పెట్టాడు. దీంతో బాలిక అనారోగ్యం మరింత క్షీణించింది. మతిస్థిమితం కోల్పోయింది. బాలిక తల్లిదండ్రులు ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. భూతవైద్యుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన పోలీసులు భూతవైద్యుడిని అరెస్టు చేశారు.

Updated Date - 2022-04-03T18:19:48+05:30 IST