Abn logo
Apr 29 2021 @ 20:26PM

ఎగ్జిట్‌ పోల్స్‌లో మమతా, స్టాలిన్ జోరు

న్యూఢిల్లీ: ఐదు అసెంబ్లీలకు సంబంధించి ఎగ్జిట్ పోల్ ఫలితాలు విడుదలయ్యాయి. కాగా, పశ్చిమ బెంగాల్‌కు సంబంధించి ఎక్కువ సర్వేలు మమతా బెనర్జీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్‌కు అనుకూలంగా ఇచ్చాయి. ఇక తమిళనాడులో డీఎంకేదే గెలుపని దాదాపు అన్ని సర్వేలు తేల్చి చెప్పాయి. అస్సాంలో మళ్లీ కమల ప్రభుత్వమే ఏర్పాటు కాబోతున్నట్లు స్పష్టమైన సంకేతాలు ఇచ్చాయి. ఇక కేరళీయులు తమ సంప్రదాయాన్ని కాదని మళ్లీ లెఫ్ట్‌కే అధికారం కట్టబెట్టనున్నారట.


ఎగ్జిట్ పోల్ ఫలితాలు

పశ్చిమ బెంగాల్‌లో 294 అసెంబ్లీ స్థానాలకు గాను ఒక్కో పార్టీకి వచ్చే స్థానాలు ఈ కింది విధంగా ఉన్నాయి: 

ఏబీపీ సీఓటర్ 109-121 (బీజేపీ), 152-164 (టీఎంసీ), 14-25 (లెఫ్ట్-కాంగ్రెస్)

రిపబ్లిక్ సీఎన్‌ఎక్స్ 138-148 (బీజేపీ), 128-138 (టీఎంసీ), 11-21 (లెఫ్ట్-కాంగ్రెస్)

టైమ్స్‌నౌ సీఓటర్ 115 (బీజేపీ), 158 (టీఎంసీ), 19 (లెఫ్ట్-కాంగ్రెస్)

ఇండియా టుడే 172-192(బీజేపీ), 64-88(టీఎంసీ), 7-12 (లెఫ్ట్-కాంగ్రెస్)

ఈటీజా రీసర్చ్ 105-115 (బీజేపీ), 164-176 (టీఎంసీ), 10-15 (లెఫ్ట్-కాంగ్రెస్)


తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలకు గాను ఒక్కో పార్టీకి వచ్చే స్థానాలు ఈ కింది విధంగా ఉన్నాయి: 

రిపబ్లిక్ సీఎన్‌ఎక్స్ 160-170 (డీఎంకే), 58-68 (అన్నా డీఎంకే), 4-6 (ఏఎంఎంకే)

ఆత్మసాక్షి సర్వే 148-152 (డీఎంకే), 72-76 (అన్నాడీఎంకే), 3-4 (ఎంఎన్‌ఎం), 3-6 (ఇతరులు)

Advertisement
Advertisement