జగన్‌ హయాంలో ఆర్టీసీ ఉనికి ప్రశ్నార్థకం!

ABN , First Publish Date - 2022-07-04T05:01:09+05:30 IST

ఆర్టీసీ రూపురేఖలు మారు స్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్‌మోహన్‌ రెడ్డి ప్రస్తుతం ఆ సంస్థ ఉనికినే ప్రశ్నార్థకం చేశాడని రాయచోటి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి రమేష్‌ కుమార్‌రెడ్డి విమర్శించారు.

జగన్‌ హయాంలో ఆర్టీసీ ఉనికి ప్రశ్నార్థకం!
గువ్వలచెరువులో బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొన్న రమేష్‌కుమార్‌రెడ్డి

రామాపురం, జూలై 3: ఆర్టీసీ రూపురేఖలు మారు స్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్‌మోహన్‌ రెడ్డి ప్రస్తుతం ఆ సంస్థ ఉనికినే ప్రశ్నార్థకం చేశాడని   రాయచోటి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి రమేష్‌ కుమార్‌రెడ్డి విమర్శించారు. బాదుడే బాదుడు కార్య క్రమంలో భాగంగా ఆదివారం రామాపురం మండలం గువ్వలచెరువులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వైసీపీ కార్యకర్తలకు నవరత్నాలు ఇచ్చి అందరికీ ఇచ్చామని గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. వైసీపీ కార్యకర్తలకు మాత్రమే పంటల బీమా అందిం దన్నారు.  2024లో వైసీపీకి ప్రజలు బుద్ధి చెబుతా రన్నారు. సామాన్య, మధ్య తరగతి ప్రజల నడ్డి విరిచే విధంగా మళ్లీ ఆర్టీసీ చార్జీలు పెంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిత్యావసర సరుకుల నుంచి అన్నింటి ధరలు పెంచుతూ సామాన్య ప్రజలను వీరబాదుడు బాదుతున్నారని ప్రభుత్వంపై  మండిపడ్డారు.  ఈ నెల 6న మదనపల్లెలో జరుగుతున్న మినీ మహానా డును జయప్రదం చేయాలని నాయకులు, కార్యకర ్తలకు పిలుపునిచ్చారు. యువకులు బైకులపై ర్యాలీగా తరలి రావాలని, పెద్దవారికి బస్సులు ఏర్పాటు చేస్తు న్నట్లు తెలిపారు. మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్‌ రమే ష్‌రెడ్డి, రాజంపేట పార్లమెంట్‌ అధికార ప్రతి నిధి చంద్రమౌళి, ఐటీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాగేంద్రనాయుడు, రాజంపేట పార్లమెంట్‌ అధ్యక్షుడు నవీన్‌కుమార్‌రెడ్డి, పార్లమెంట్‌ తెలుగు యువత కార్య నిర్వాహక కార్యదర్శి రాజేష్‌, తెలుగు యువత ఉపాధ్యక్షుడు దివ్యకుమార్‌రెడ్డి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు అజీమ్‌, హరిప్రసాద్‌, దుర్గాప్రసాద్‌, చింత పిచ్చల రామకృష్ణగౌడ్‌, షంషీర్‌బాషా, ప్రసాద్‌, వెంక ట్రామిరెడ్డి, చాంద్‌బాషా, మదన్‌మోహన్‌ పాల్గొన్నారు. 

రైల్వేకోడూరు: బస్సు చార్జీల పెంపును ఉపసంహరించుకోకపోతే వైసీపీకి పుట్టగతులుండవని రైల్వేకోడూరు టీడీపీ ఇన్‌చార్జ్‌ కస్తూరి విశ్వనాథనాయుడు తెలిపారు. బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా రైల్వేకోడూరు ప్రధాన రహదారిలో ధర్నా నిర్వహించారు.  బస్సు చార్జీలను పెంపును ఉపసంహరించుకోని పక్షంలో దశలవారీగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. టీడీపీ సీనియర్‌ నాయకులు మలిశెట్టి మురళీధర్‌గౌడ్‌, పోతురాజు నవీన్‌, నార్జాల హేమరాజ్‌, మాజీ జడ్పీటీసీ సభ్యుడు నాయుడోరి రమణ, మార్కెట్‌ కమిటీ మాజీ  చైౖర్మన్‌ కమతం నాగరాజయాదవ్‌, ఓబువారిపల్లె మాజీ ఎంపీపీ జి. వెంకట్రామరాజు, దళిత నేతలు తేనేపల్లి చిన్నా, పీ. రమేష్‌బాబు, స్థానిక నాయకులు హస్తి చంద్రరాజు, టీడీపీ బాషా, మిట్టవీధి మధు, పోకల మణి తదితరులు పాల్గొన్నారు.

ఓబులవారిపల్లె :  బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా కడప-చెన్నై హైవే రోడ్డుపై భైఠాయించి బస్సు చార్జీల పెంపుపై నిరసన వ్యక్తం చేశారు.  కస్తూరి విశ్వనాఽథనాయుడు, పారిశ్రామిక వేత్త విశ్వేశ్వ రనాయుడు, మాజీ ఎంపీపీ వెంకటేశ్వరరాజు,  జడ్పీ టీసీ మాజీ సభ్యుడు నాయుడోరి రమణ, కమతం నాగరాజు, మహిళా నాయకురాలు అనిత దీప్తి, శివ య్యనాయుడు, రవీంద్రనాయుడు, రెడ్డయ్య నాయుడు, ఫణీంద్ర తదితరులు  పాల్గొన్నారు. 

వైసీపీని సాగనంపుదాం

లక్కిరెడ్డిపల్లె: వైసీపీ దుర్మార్గ పాలనను వచ్చే అసెం బ్లీ ఎన్నికల్లో సాగనంపాలని  మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్‌ కాలాడి ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు.  కుర్నూతల పంచాయతీ మూలపల్లె, అగ్రహారం, దియ్యలవాండ్ల పల్లెల్లో ఆదివారం బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వ హించారు. నియోజకవర్గ బీసీ సెల్‌ అధ్యక్షుడు బడు గు వాసుదేవుడు, ఎంపీటీసీ సభ్యుడు శేఖర్‌, రవి శంక ర్‌రెడ్డి, మైనార్టీ నాయకుడు అజ్మతుల్లా, బీసీ నాయ కులు మండ్ల రామాంజనేయులు, వెంకట్రమణ, వెంకటరామరాజు, తెలుగుయువత నాయకులు జొన్న శ్రీనివాసులు, పవన్‌కుమార్‌, మణికంఠ, చంద్రబాబు, మహేంద్ర, 1వ వార్డు మెంబర్‌ గీతాకుమారి, వెంకట రామరాజు, టీడీపీ యువ నాయకులు మల్లికార్జున, నాగేంద్ర, రామతులసి, బాబాఫకృద్దీన్‌, మౌల, గంగ రాజు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

రాయచోటిటౌన్‌: ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి బాదుడు కు కులమతాల లేవని, బాదుడే బాదుడు జగన్‌రెడ్డి దిగిపోవాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్‌ బాషా అన్నారు. ఆదివారం రాయచోటి మున్సిపాలిటీ లోని 23, 24 వార్డుల్లో టీడీపీ పట్టణ అధ్యక్షుఛిు ఖాదర్‌వలి ఆధ్వర్యంలో బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు రాజంపేట పార్లమెంట్‌ కార్యనిర్వాహక కార్యదర్శి కొట్టే చలపతి, టీడీపీ నాయకులు మాజీ, తెలుగు యువత కార్యదర్శి జావీద్‌, మైనార్టీ సెల్‌ కార్యదర్శి సయ్యద్‌, పట్టణ మైనార్టీ సెల్‌ అధ్యక్షులు అతావుల్లా, మహబూబ్‌, సాయి, మాజీ కౌన్సిలర్‌ మస్తాన్‌ తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2022-07-04T05:01:09+05:30 IST