30 నుంచి ప్రేక్షకులకు వినోదం

ABN , First Publish Date - 2021-07-28T06:55:26+05:30 IST

వినోదానికి తెరతీసేందుకు ముహూర్తం ఖరారైంది.

30 నుంచి ప్రేక్షకులకు వినోదం

థియేటర్లు తెరవాలని ఎగ్జిబిటర్ల నిర్ణయం

ధరలపై ప్రభుత్వానికి విన్నవించే యోచన

29న రాష్ట్ర ఎగ్జిబిటర్ల సమావేశం


ఆంధ్రజ్యోతి - విజయవాడ : వినోదానికి తెరతీసేందుకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 30వ తేదీ నుంచి విజయవాడ నగరంలో వెండి తెరపై బొమ్మ వేయడానికి ఎగ్జిబిటర్లు రంగం సిద్ధం చేస్తున్నారు. అదే రోజు మూడు, నాలుగు చిన్న బడ్జెట్‌ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఆ చిత్రాలకు సంబంధించిన వాల్‌ పోస్టర్లను కూడా కొన్ని థియేటర్ల వద్ద ఏర్పాటు చేశారు. జిల్లాలో మొత్తం 255 సినిమా థియేటర్లు ఉన్నాయి. ఇందులో సింగిల్‌, మల్టీప్లెక్స్‌ థియేటర్లు 50 వరకు విజయవాడలో ఉన్నాయి. మల్టీప్లెక్స్‌లో ఒక స్ర్కీన్‌పై చిత్రాలు ప్రదర్శించాలని,  సింగిల్‌ థియేటర్లనూ తెరవాలని ఒక నిర్ణయానికి వచ్చారు. 


ధరలపై ప్రభుత్వం వద్దకు..

కొత్త చిత్రాలు విడుదలైనప్పుడు తొలి రెండు వారాల్లో టికెట్లను థియేటర్లలో తరగతుల వారీగా ఎంత ధరలకు విక్రయించాలో నిర్ణయిస్తూ ప్రభుత్వం ఒక ఉత్తర్వును విడుదల చేసింది. ఈ ధరలు ఎ కేంద్రాల్లోని థియేటర్ల వరకు బాగానే ఉన్నా, బీ, సీ కేంద్రాల్లోని థియేటర్లకు నష్టం కలిగించేలా ఉన్నాయని ఎగ్జిబిటర్లు చెబుతున్నారు. దీనిపై ప్రభుత్వానికి మరోసారి విన్నవించాలని ఎగ్జిబిటర్లు భావిస్తున్నారు. కొవిడ్‌ నుంచి కోలుకుని, వ్యాపారం మొత్తం ఒక ట్రాక్‌పైకి వచ్చే వరకు ఈ విధానాన్ని అమలు చేయాలని కోరే యోచనలో వారు ఉన్నారు. దీనిపై చర్చించడానికి ఈ నెల 29వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎగ్జిబిటర్లు విజయవాడలో భేటీ కావాలని నిర్ణయించుకున్నారు. 


Updated Date - 2021-07-28T06:55:26+05:30 IST