Advertisement
Advertisement
Abn logo
Advertisement

చేతులు చక్కదనం కోసం...

ముంజేతులు దృఢంగా, చక్కని ఆకృతి సంతరించుకోవాలంటే అందుకు తోడ్పడే వ్యాయామాలు చేయాలి. బరువులు, ఇతరత్రా పరికరాలకు బదులుగా ఇంట్లోనే చేసుకోగలిగే తేలికపాటి వ్యాయామాలు ఉన్నాయి. వాటిని ఎలా చేయాలంటే....


ఇన్‌వర్టెడ్‌ పుషప్‌

పాదాలు చదునుగా నేల మీద ఉంచి, నేల మీద చేతులు ఆనించి, ఆంగ్ల అక్షరం ‘వి’ ఆకారంలో వంగాలి. ఈ భంగిమలో మడమలను పైకి లేపుతూ, మోచేతులను వంచుతూ, చేతుల మీద బరువు పడేలా పైకి లేస్తూ ఉండాలి. ఇలా 10 సార్లు మూడు సెట్లు చేయాలి. 


టేబుల్‌ టాప్‌ లిఫ్ట్‌

మోకాళ్లను మడిచి, అరికాళ్లు చదునుగా ఉండేలా నేల మీద కూర్చోవాలి. చేతులును వెనక్కి చాపి, పిరుదులకు అభిముఖంగా ఉంచాలి. ఈ భంగిమలో నడుమును, తొడలకు సమాంతరంగా పైకి లేపి దింపాలి. ఇలా చేస్తున్నప్పుడు చేతుల మీద బరువు పడేలా చూసుకోవాలి. ఇలా 10 సార్లు, మూడు సెట్లు చేయాలి.

Advertisement
Advertisement