Advertisement
Advertisement
Abn logo
Advertisement

‘మాప్‌’తో మజా!

ఆంధ్రజ్యోతి(23-05-2020):

ఆడుతు పాడుతు పనిచేస్తే అలుపూ సొలుపూ ఉండదు. బోర్‌ కూడా కొట్టదు. వ్యాయామం కూడా అంతే! ఎప్పటికప్పుడు విభిన్నంగా ప్రయత్నిస్తే అదీ ఒక సరదా వ్యాపకం అయిపోతుంది. ఈ వ్యాయామం కూడా అలాంటిదే. ట్రై చేయండి... 


ట్రంక్‌ రొటేషన్‌: మాప్‌ స్టిక్‌ను రెండు చేతులతో మీ శరీరానికి దగ్గరగా, ఛాతీ ఎత్తులో పట్టుకొని నిల్చోండి. కాళ్ల మధ్య మీ భుజాలంత దూరం ఉండాలి. నడుము పై భాబాగాన్ని నెమ్మదిగా ఎడమ వైపునకు తిప్పండి. శరీరం బిగువుగా పెట్టాలి. వెన్ను వంగకూడదు. కొన్ని క్షణాల తరువాత ఇదే విధంగా కుడి వైపునకు తిరగండి. ఇలా 15 సెట్లు చేయండి.


డాంకీ కిక్‌: మోకాళ్లు, అరచేతులను నేలపై ఆనించండి. శరీరం బరువంతా వాటిపైనే బ్యాలెన్స్‌ చేయాలి. వెన్ను భాగం, తల నేలకు సమాంతరంగా ఉండాలి. బ్రూమ్‌ స్టిక్‌ను కుడి కాలి మడతలో పెట్టండి. ఇది ప్రారంభ భంగిమ. ఇప్పుడు బ్రూమ్‌ స్టిక్‌ కింద పడకుండా, కుడి కాలిని 90 డిగ్రీల కోణంలో మడిచి, నిదానంగా పైకి ఎత్తండి. కాలు నేలకు సమాంతరంగా రావాలి. మళ్లీ ప్రారంభ పొజిషన్‌కు వచ్చేయండి. ఇదే విధంగా రెండు కాళ్లతో 15 సార్లు ప్రయత్నించండి.


యాబ్స్‌ డైనమో: వెల్లకిలా పడుకొని, కాళ్లను వంచి, పాదాలు నేలపై పెట్టండి. బ్రూమ్‌ స్టిక్‌ పట్టుకొని, చేతులను పైకి చాచండి. చేతుల మధ్య భుజాలంత వెడం ఉండాలి. తరువాత కుడి కాలిని పూర్తిగా జాపండి. అలాగే నడుము పై భాగాన్ని, కుడి కాలిని నెమ్మదిగా పైకి లేపండి. అరచేతులను వీలైనంత పాదాలకు దగ్గరగా తీసుకువెళ్లాలి. మళ్లీ మునుపటి పొజిషన్‌కు వెళ్లండి. కాలు మార్చి, ఇలాగే ప్రయత్నించండి. ఒక్కో వైపు 10 సార్లు చేయండి. వీటివల్ల బాడీ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది.


Advertisement
Advertisement