Advertisement
Advertisement
Abn logo
Advertisement

కుర్చీతో వ్యాయామం

ఎక్కువ సమయం ల్యాప్‌టాప్‌, కంప్యూటర్‌ ముందు కూర్చొని పనిచేయడం వల్ల మెడనొప్పి, వెన్ను పైభాగంలో నొప్పి వస్తుంది. దాంతో ఏకాగ్రతగా పనిచేయలేకపోతారు. అయితే ‘కుర్చీలో కూర్చొని తేలికైన వ్యాయామాలతో నొప్పి తగ్గించుకోవచ్చు’ అంటున్నారు సెలబ్రిటీ ఫిట్‌నెస్‌ ఎక్స్‌పర్ట్‌, పోషకాహార నిపుణురాలు రుజుతా దివేకర్‌. మూడు తేలికైన స్ట్రెచింగ్‌ వ్యాయామాలతో మెడ, వెన్ను నొప్పి తగ్గించుకోవడం ఎలాగో ఆమె చెబుతున్నారిలా...


స్ట్రెచ్‌ 1: ముందుగా కుర్చీలో కూర్చోవాలి. రెండు చేతులనూ సమాంతరంగా ముందుకు చాచాలి. తర్వాత భుజాలను చెవులకు దగ్గరగా తీసుకుని, క్రమంగా వెనక్కి తీసుకురావాలి.


ఇప్పుడు చేతులను నెమ్మదిగా పైకి ఎత్తాలి. చేతులు తలకు సమాంతరంగా ఉండేలా చూసుకోవాలి  అరచేతులను లాక్‌ చేసినట్టుగా ఉంచి, వాటిని సీలింగ్‌ వైపు తిప్పాలి.

తర్వాత చేతులను చెవుల వెనక్కి కదిలిస్తూ శరీరాన్ని స్ట్రెచ్‌ చేయాలి. తలను అటూఇటూ కదిలించకుండా ఈ పొజిషన్‌లో అయిదు సెకన్లు ఉండాలి.


స్ట్రెచ్‌ 2: కుర్చీలో ఒక పక్కకు కూర్చోవాలి. రెండు చేతులను కుర్చీ మీద పెట్టాలి. పాదాల మధ్య దూరం ఉండేలా చూసుకోవాలి.


ఇప్పుడు ఛాతీ, భుజాలను ముందుకూ, వెనక్కీ కదిలించాలి. ఇప్పుడు చేతులతో కుర్చీని పట్టుకొని శరీరాన్ని కుర్చీ వైపు తీసుకురావాలి. వీపు భాగం కదలకుండా చూసుకోవాలి.


స్ట్రెచ్‌ 3: కుర్చీలో నుంచి లేచి కొద్ది దూరంలో కుర్చీ వైపు ముఖం పెట్టి నిల్చోవాలి. 


తర్వాత ముందుకు వంగి రెండు అరచేతులను కుర్చీ మీద ఉంచాలి. ఇప్పుడు చేతులను పైకి ఎత్తి కాళ్లను వెనక్కి జరిపి శరీరాన్ని ముందుకూ, వెనక్కీ కదిలించాలి. దాంతో తొడ కండరాలకు వ్యాయామం లభిస్తుంది.
Advertisement
Advertisement

ప్రత్యేకం మరిన్ని...