మినీ మహానాడు ఏర్పాట్లపై కసరత్తు

ABN , First Publish Date - 2022-07-04T05:20:45+05:30 IST

మదనపల్లెలో ఈనెల 6వతేదీ(బుధవారం) జరుగను న్న టీడీపీ మినీ మహానాడుకు నేతలు ముమ్మర కసతరత్తు చేస్తున్నారు.

మినీ మహానాడు ఏర్పాట్లపై కసరత్తు
సమీక్షా సమావేశాల ఏర్పాట్లు పరిశీలిస్తున్న కిశోర్‌కుమార్‌రెడ్డి

కలికిరి, జూలై 3: మదనపల్లెలో ఈనెల 6వతేదీ(బుధవారం) జరుగను న్న టీడీపీ మినీ మహానాడుకు నేతలు ముమ్మర కసతరత్తు చేస్తున్నారు. భారీ ఎత్తున జన సమీకరణ కోసం ఆ పార్టీ నేతలు దృష్టి పెట్టారు. పీలేరు నియోజకవర్గంలో ప్రధానంగా మదనపల్లెకు సమీపంలో వున్న కలికిరి, వాల్మీకిపురం, గుర్రంకొండ, పీలేరు మండలాల నుంచి వీలైనంత అత్యధిక సంఖ్యలో ప్రజలు హాజరయ్యేందుకు కృషి చేస్తున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్‌కుమార్‌ రెడ్డి మండల స్థాయి సమావేశాలను నిర్వహించి ఆ మేరకు పార్టీ శ్రేణులకు అవసరమైన సూచనలందజేశారు. మదనపల్లె సమావేశానికి హాజరు కావాలని కోరు తూ ఆయనే స్వయంగా మండలంలోని పలు గ్రామాల్లో పర్యటిస్తూ సమావేశానికి హాజరయ్యేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవలసిం దిగా కోరుతున్నారు. గురువారం పార్టీ ప్రతినిధులతో చంద్రబాబు కలికిరి లో నిర్వహించే సమీక్షా సమావేశాల కోసం జరుగుతున్న ఏర్పాట్లను ఆదివారం కిఽశోర్‌కుమార్‌రెడ్డి మరోమారు పరిశీలించారు. దీంతోపాటు సమావేశాలకు హాజరయ్యే ప్రతినిధుల వాహనాల పార్కింగ్‌ కోసం అనువైన స్థలాలను కూడా పరిశీలించి. ఠానా మిట్ట పైన వున్న భూ ము ల్లో అనుకూలంగా వుంటుం దని నిర్ణయించారు. ఇక మదనపల్లె మినీ మహానాడుకు వెళ్లే వాహనా లన్నీ టేకలకోన ఏపీఐఐసీ ఇండస్ట్రియల్‌ పార్క్‌ వద్దకు చేరుకునేటట్లు ఏర్పాట్లు చేస్తున్నారు. పీలేరు, కేవీ పల్లె, కలికిరి, కలకడ మండలాలకు చెందిన వాహనాలన్నీ  ఒకే చోటుకు చేరుకుని మదనపల్లె వరకూ ర్యాలీ గా వెళ్లాలని ఆలోచిస్తున్నారు. 

ప్రతినిఽధుల సమావేశాలకు రెండు వేదికలు

ఇక కలికిరిలో గురువారం పార్టీ ప్రతినిధులతో జరిగే సమీక్షా సమావేశా లకు వేర్వేరుగా రెండు వేదికలను ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో నియోజక వర్గానికి రెండు గంటలపాటు సమయం కేటాయిస్తున్నారు. ఈ లెక్కన ఏడు నియోజకవర్గాలకు కలిపి కనీసం 14 గంటల సమయం అవసరమ వుతుంది. ఉదయం 9 గంటలకు సమావేశాలు ప్రారంభించినా అవి పూర్తయ్యే సరికి రాత్రి 11 గంటలవుతుంది. ఒక నియోజకవర్గం పూర్త య్యే సరికి మరో వేదిక వద్ద ఇంకో నియోజకవర్గానికి చెందిన ప్రతినిధు లు సిద్దంగా వుండేటట్లు ప్రణాళిక వేస్తున్నారు. ఒక నియోజకవర్గం సమీక్ష పూర్తయిన వెంటనే పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మరో వేదిక వద్దకు వెంట వెంటనే చేరుకోనున్నారు. ఇక ఒక్కో నియో జకవర్గం నుంచి సమీక్షలకు 12 నుంచి పదిహేను వందల మంది ప్రతినిధులు హాజరు కావచ్చని చెపుతున్నారు. 

మినీమహానాడును జయప్రదం చేయాలి

రామసముద్రం, జూలై 3: మదనపల్లెలో ఈనెల 6వ తేదీ నిర్వహించ నున్న మినీమహానాడును జయప్రదం చేయాలని మదనపల్లె నియోజక వర్గ టీడీపీనేత బోడెపాటి శ్రీనివాస్‌ పిలుపునిచ్చారు. ఆదివారం రామస ముద్రం మండలంలోని అన్ని గ్రామాల్లో ఆయన పర్యటించి చంద్రబాబు నాయుడు హాజరయ్యే మినీమహానాడుకు టీడీపీ కార్యకర్తలందరు హాజ రు కావాలని కోరారు.  కార్యక్రమంలో నాయకులు శివశంకర్‌, కష్ణంరాజు, రాజేష్‌, శివకుమార్‌, వాహీద్‌, వెంకటరమణ, ఖలీల్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-07-04T05:20:45+05:30 IST