Advertisement
Advertisement
Abn logo
Advertisement

నడకతో గుండెకు రక్ష

ఆంధ్రజ్యోతి(17-08-2021)

గుండెపోటుకు గురైన వాళ్లు వారం మొత్తంలో మూడు నుంచి నాలుగు గంటల పాటు నడవగలిగితే డెత్‌ రిస్క్‌ అవకాశాలు 54 శాతం తగ్గుతాయని ఓ అధ్యయనంలో తేలింది. మెడికల్‌ జర్నల్‌ ‘న్యూరాలజీ’ అనే ఆన్‌లైన్‌ పత్రికలో ప్రచురితమైన ఆ అధ్యయనంలో గుండెపోటు బారిన పడినవాళ్లు వారం మొత్తంలో కనీసం మూడు నుంచి నాలుగు గంటల పాటు నడవడం లేదా వారం మొత్తంలో మూడు నుంచి నాలుగు గంటల పాటు సైకిల్‌ తొక్కడం లేదా అంతే సమానమైన ప్రభావంతో కూడిన వ్యాయామాలు చేయడం వల్ల వారి డెత్‌ రిస్క్‌ 54 శాతం తగ్గుతుందని చెప్పడం జరిగింది. మరీ ముఖ్యంగా ఇలాంటి శారీరక వ్యాయామంతో యువకులకు ఎక్కువగా లాభం చేకూరే వీలుందని కూడా ఈ అధ్యయనం ద్వారా తేలింది. 75 ఏళ్ల కంటే తక్కువ వయస్కులు ఆ మాత్రం వ్యాయామం చేయడం వల్ల వారిలో మరణించే అవకాశాలు 80 శాతం తగ్గుతాయి. గుండెపోటుకు గురైన వ్యక్తుల పరిపూర్ణ ఆరోగ్యానికి దోహదపడే జీవనశైలి రూపకల్పనలో భాగంగా జరిపిన అధ్యయనం ద్వారా ఈ ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. కాబట్టి గుండెపోటుకు గురైన వ్యక్తులు రోజుకు 30 నిమిషాల నడక లేదా సైక్లింగ్‌ లాంటి వ్యాయామాలను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలి.

Advertisement
Advertisement

ప్రత్యేకం మరిన్ని...