ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు కసరత్తు

ABN , First Publish Date - 2020-10-01T14:04:03+05:30 IST

కృష్ణా - గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికలకు..

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు కసరత్తు

నేటి నుంచి నవంబరు 6 వరకు ఓటర్ల నమోదు

డిసెంబరు 1న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ

మార్చితో ముగియనున్న ఏఎస్‌ రామకృష్ణ పదవీ కాలం


గుంటూరు(ఆంధ్రజ్యోతి): కృష్ణా - గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికలకు కసరత్తు ప్రారంభ మైంది. వచ్చే ఏడాది మార్చితో ఎమ్మెల్సీ ఏఎస్‌ రామకృష్ణ పదవీకాలం ముగియనుంది. దీంతో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఈ నియోజక వర్గానికి ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారి అయిన డీఆర్‌వో, జేసీ(సచివా లయాలు) పీ ప్రశాంతి బుధవారం ఓటర్‌ నమోదుకు నోటిఫికేషన్‌ జారీ చేశారు. మూడు నెలలకు పైగా ఓటర్ల నమోదు ప్రక్రియ కొనసాగుతుంది. ఆ తర్వాత ఫిబ్ర వరిలో నోటిఫికేషన్‌, మార్చిలో పోలింగ్‌ జరగనుంది. ఓట రు నమోదు ప్రక్రియకి ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టడంతో ఔత్సాహిక అభ్యర్థుల్లో ఉత్సాహం ప్రారంభమైంది.


ఏపీ శాసనమండలి పునరుద్ధరణ జరిగిన తర్వాత కృష్ణా-గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి కేఎస్‌ లక్ష్మణరావు వరుసగా రెండుసార్లు గెలుపొందారు. ఆ తర్వాత 2015లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఏఎస్‌ రామకృష్ణని బరిలో దింపింది. ఆ ఎన్నికల్లో రామకృష్ణపై లక్ష్మణరావు ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత జరిగిన పట్టభద్రు ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో లక్ష్మణరావు మళ్లీ గెలు పొందారు. వచ్చే ఏడాది మార్చి తో రామకృష్ణ పదవీకాలం ముగియ నున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ కు ఈసీ సన్నాహక ప్రక్రియని ప్రారంభించింది. గురువారం(అక్టోబరు 1) నుంచి ఓటర్‌ నమోదు ప్రక్రి యని చేపడుతున్నట్లు నోటిఫికేషన్‌ జారీ చేసిం ది. నవంబరు 6 వరకు ఓటర్ల నమోదుకు అవకాశం కల్పించింది.


దరఖా స్తులను ఫారం-19లో జిల్లా రెవెన్యూ అధికారి, సబ్‌ కలెక్టర్‌, ఆర్‌డీవో, తహసీ ల్దార్‌, మునిసి పల్‌ కమిషనర్‌, ఎంపీడీవో కార్యాలయాల్లో అందజేయొచ్చు. ఆ తర్వాత డిసెంబరు 1న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురిస్తారు. అదే రోజు నుంచి డిసెంబరు 31 వరకు అభ్యంతరాలను స్వీకరిస్తారు. వాటిని పరిష్కరించి 2021 జనవరి 12న అనుబంధ జాబితాలను సిద్ధం చేస్తారు. జనవరి 18న తుది ఓటర్ల జాబితాని ప్రకటిస్తారు. 


ఓటరుగా నమోదు ఇలా..

ఓటర్లుగా నమోదు చేసుకోదలచిన వారు కనీసం మూడేళ్ల పాటు ఉన్నత పాఠశాల(సెకండరీ స్కూల్‌) స్థాయిలో ఉపాధ్యాయుడిగా పని చేసినట్లు ధ్రువీకరణ పత్రంతో పాటు సాధారణ ఓటరు గుర్తింపు నకలు, ఒక ఫొటో జత చేసి ఫారం-19లో దాఖలు చేయాలి. ఫారం-19 కాపీలు సీఈవో ఆంధ్ర.ఎన్‌ఐసీ.ఇన్‌ వెబ్‌సైట్‌ నుంచి పొందవచ్చని డీఆర్‌వో సూచించారు.  


Updated Date - 2020-10-01T14:04:03+05:30 IST