వ్యాయామ విద్య అవసరం

ABN , First Publish Date - 2022-07-02T05:01:37+05:30 IST

విద్యార్థులకు చదువుతో పాటు వ్యాయామ విద్య చాలా అవసరమని అన్నమయ్య జిల్లా విద్యాశాఖాధికారి రాఘవరెడ్డి అన్నారు.

వ్యాయామ విద్య  అవసరం
జిల్లా విద్యాశాఖాధికారి రాఘవరెడ్డిని సన్మానిస్తున్న పీఈటీలు, పీడీలు

రాయచోటిటౌన, జూలై1: విద్యార్థులకు చదువుతో పాటు వ్యాయామ విద్య చాలా అవసరమని అన్నమయ్య జిల్లా విద్యాశాఖాధికారి రాఘవరెడ్డి అన్నారు. రెండు రోజుల పునశ్చరణ తరగతుల్లో భాగంగా శుక్రవారం రాయచోటి పట్టణంలోని డైట్‌ కేంద్రంలో  పీఈటీలు, పీడీల సమావే శంలో ఆయన మాట్లాడారు. రెండు రోజుల  శిక్షణ తరగ తులను పీఈటీలు, పీడీలు సక్రమంగా సద్వినియోగం చేసుకుని,  విద్యార్థులు వ్యాయామ తరగతులకు తప్పని సరిగా హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించా రు. ప్రతి పాఠశాలలో విద్యార్థులు ఎక్కువగా అభిమానిం చే ఉపాధ్యాయుడు వ్యాయామ ఉపాధ్యాయుడేనన్నారు. వ్యాయామ విద్యతో మానసిక ప్రశాంతత, శారీరక దృఢ త్వం ఏర్పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కోర్సు డైరెక్టర్‌ వైసీ రెడ్డెప్పరెడ్డి, డీఆర్పీలు రమేష్‌, వీరాంజనే యులు, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-02T05:01:37+05:30 IST