Abn logo
Mar 27 2020 @ 04:25AM

దివీస్‌కు లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపు

భీమునిపట్నం (రూరల్‌) మార్చి 26: ప్రజారోగ్యాన్ని కాపాడే మందులను తయారు చేస్తున్నందున లాక్‌డౌన్‌ నుంచి తమ దివీస్‌ కర్మాగారానికి కేంద్ర ప్రభుత్వం మినహాయింపు ఇచ్చిందని దివీస్‌ జనరల్‌ మేనేజర్‌ వై.ఎస్‌.కోటేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు భారత ప్రభుత్వ  కెమికల్‌, ఫెర్టిలైజర్స్‌ మంత్రిత్వశాఖ కార్యదర్శి డాక్టర్‌ పి.డి.వాఘేలా అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖలు రాశారని పేర్కొన్నారు.

Advertisement
Advertisement
Advertisement