Spices Boardలో ఎగ్జిక్యూటివ్‌లు

ABN , First Publish Date - 2022-08-13T21:36:44+05:30 IST

కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వశాఖకు చెందిన స్పైసెస్‌ బోర్డ్‌(Spices Board)... కొచ్చిన్‌తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఎస్‌బీ కార్యాలయాల్లో(SB offices) ఒప్పంద ప్రాతిపదికన ఎగ్జిక్యూటివ్‌లు, ట్రేడ్‌ అనలిస్ట్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Spices Boardలో ఎగ్జిక్యూటివ్‌లు

ఖాళీలు 20


కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వశాఖకు చెందిన స్పైసెస్‌ బోర్డ్‌(Spices Board)... కొచ్చిన్‌తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఎస్‌బీ కార్యాలయాల్లో(SB offices) ఒప్పంద ప్రాతిపదికన ఎగ్జిక్యూటివ్‌లు, ట్రేడ్‌ అనలిస్ట్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.


1. ఎగ్జిక్యూటివ్‌(మార్కెటింగ్‌): 08 పోస్టులు

2. ఎగ్జిక్యూటివ్‌(డెవల్‌పమెంట్‌): 11 పోస్టులు

3. ట్రేడ్‌ అనలిస్ట్‌: 01 పోస్టు

అర్హత: పోస్టును అనుసరించి బీఎస్సీ(అగ్రికల్చర్‌, హార్టికల్చర్‌, ఫారెస్ట్రీ), ఎంఎస్సీ(బోటనీ), ఎంఏ(ఎకనామిక్స్‌), ఎంబీఏ(మార్కెటింగ్‌) ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.

వయసు: 40 ఏళ్లు మించకూడదు

వేతనం: నెలకు రూ.30,000 నుంచి రూ.40,000 వరకు ఉంటుంది.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా

దరఖాస్తు ప్రక్రియ: దరఖాస్తులను మొదట ఈమెయిల్‌ ద్వారా పంపాలి. ఆఫ్‌లైన్‌ దరఖాస్తులు, సంబంధిత ధ్రువపత్రాల నకళ్లను సెక్రటరీ, స్పైసెస్‌ బోర్డ్‌, కొచ్చిన్‌ కేరళ చిరునామాకు పంపాలి. 

దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 26

ఈమెయిల్‌ ద్వారా దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 19

వెబ్‌సైట్‌: http://www.indianspices.com/

Updated Date - 2022-08-13T21:36:44+05:30 IST