కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు.. నెలకు జీతం ఎంతో తెలుసా..!

ABN , First Publish Date - 2021-12-09T17:11:05+05:30 IST

భారత ప్రభుత్వానికి చెందిన..

కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు.. నెలకు జీతం ఎంతో తెలుసా..!

BCPLలో ఎగ్జిక్యూటివ్‌లు


భారత ప్రభుత్వానికి చెందిన బ్రహ్మపుత్ర క్రాకర్‌ అండ్‌ పాలిమర్‌ లిమిటెడ్‌(బీసీపీఎల్‌)... ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.


మొత్తం ఖాళీలు: 36

పోస్టులు: డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌, చీఫ్‌ మేనేజర్‌, సీనియర్‌ మేనేజర్‌, మేనేజర్‌

విభాగాలు: ఎఫ్‌అండ్‌ఏ, లా, హెచ్‌ఆర్‌, కెమికల్‌, మెకానికల్‌, మార్కెటింగ్‌, ఐటీ, ఎలక్ట్రికల్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ తదితరాలు


అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేట్‌ డిగ్రీ, ఎల్‌ఎల్‌బీ, బ్యాచిలర్స్‌ డిగ్రీ, ఎంబీఏ/ఎంఎంఎస్‌, బీఈ/బీటెక్‌/బీఎస్సీ ఇంజనీరింగ్‌, సీఏ/ఐసీడబ్ల్యూఏఐ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

వయసు: 30 నుంచి 51 సంవత్సరాల మధ్య ఉండాలి

జీతభత్యాలు: నెలకు రూ.24,900 నుంచి రూ.73,000 వరకు చెల్లిస్తారు

ఎంపిక విధానం: రాత పరీక్ష/గ్రూప్‌ డిస్కషన్‌/ఇంటర్వ్యూ ఆధారంగా

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో 

దరఖాస్తు ఫీజు: జనరల్‌, ఈబ్ల్యూఎస్‌, ఓబీసీ అభ్యర్థులు రూ.600 చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: డిసెంబరు 13

దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 12

వెబ్‌సైట్‌: https://bcplonline.co.in/



Updated Date - 2021-12-09T17:11:05+05:30 IST