పాల్వంచలో రాఘవ అనుచరుల బరితెగింపు

ABN , First Publish Date - 2022-01-05T21:40:16+05:30 IST

పాత పాల్వంచలో ఎమ్మెల్యే తనయుడు

పాల్వంచలో రాఘవ అనుచరుల బరితెగింపు

భద్రాద్రి కొత్తగూడెం: పాత పాల్వంచలో ఎమ్మెల్యే తనయుడు రాఘవ అనుచరులు బరితెగించారు. ఆత్మహత్యకు పాల్పడిన రామకృష్ణ బావమరిది జనార్దన్‌ను బెదిరించారు. వెంటనే కేసు వెనక్కి తీసుకోవాలని, పాల్వంచ నుంచి వెళ్లిపోవాలని జనార్దన్‌కు రాఘవ అనుచరులు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో పాల్వంచ ఏసీపీ రోహిత్‌ రాజుకు జనార్దన్ ఫిర్యాదు చేశాడు. జనార్దన్‌కు రక్షణ కల్పిస్తామని ఏసీపీ రోహిత్‌  చెప్పారు. 

Updated Date - 2022-01-05T21:40:16+05:30 IST