ఇంటిగ్రేటెడ్‌ యాప్‌ల నుంచి మినహాయించాలి

ABN , First Publish Date - 2022-08-19T04:32:57+05:30 IST

ఇంటిగ్రేటెడ్‌ యాప్‌ల నుంచి మినహాయించాలి

ఇంటిగ్రేటెడ్‌ యాప్‌ల నుంచి మినహాయించాలి
రాజుపాళెంలో వినతి పత్రం ఇస్తున్న ఉపాధ్యాయ సంఘ నేతలు

జమ్మలమడుగు రూరల్‌, ఆగస్టు 18: రాష్ట్ర ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్‌ యాప్‌ల భారం నుంచి ఉపాధ్యాయులను మినహాయించాలని సీపీ ఎం జమ్మలమడుగు కార్యదర్శి శివనారాయణ డిమాండ్‌ చేశారు. గురువారం ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు బోధన చేయాల్సిన ఉపాధ్యాయులను పలు రకాల యాప్‌ల పేరుతో బోధనేతర కార్యక్రమాలకు కేటాయించడాన్ని అధికారులు తీవ్రస్థాయిలో ఉపాధ్యాయులపై ఒత్తిడి తెస్తున్నారన్నారు.  

సొంత మొబైల్‌లోకి డౌన్‌లోడ్‌ చేయలేము

రాజుపాళెం, ఆగస్టు 18: విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజన పథ కం తదితర వివరాలు అప్‌లోడ్‌ చేసేందుకు ఇంటిగ్రేటెడ్‌ యాప్‌ను సొంత ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేయలేమని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. గురువారం జడ్పీ హైస్కూలులో నిరసన వ్యక్తం చేసిన వారు మాట్లాడుతూ ఈ యాప్‌లో డౌన్‌లోడ్‌ చేయడం పట్ల వ్యక్తిగత సమాచారా నికి భద్రత లేకుండాపోతుందన్నారు. సొంత ఫోన్‌ నుంచి ప్రభుత్వం నాణ్యమైన డివైజర్లు, నెట్‌వర్కులు మా పాఠశాల ప్రాంతంలో ఏర్పా టు చేస్తే విద్యార్థుల హాజరు నమోదు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో సీవీ ప్రసాద్‌, ఉపాధ్యాయునీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

చాపాడులో...

చాపాడు, ఆగస్టు 18: ఉపాధ్యాయుల కోసం ప్రభుత్వం చేపట్టిన కొత్త యాప్‌లను రద్దు చేయాలని ఏపీటీఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్యాంసుందర్‌రెడి ్డ కోరారు. ఈ యాప్‌లతో ఉపాధ్యాయులకు, విద్యార్థులకు మధ్య బోధనకు ఆటంకం ఏర్పడుతోందన్నారు. ప్రభుత్వం ఉపాధ్యాయులను వేధించడం తగదన్నారు. ప్రభుత్వం డివైజ్‌, ఇంటర్నెట్‌ డాట్‌లను సరఫరా చేసేంతవరకు ముఖ ఆధారిత యాప్‌ ఉపయోగించబోమని చెప్పారు. ఎంఈఓ రవిశంకర్‌కు ఉపాధ్యాయులు వినతి పత్రం అందజేశారు.

ఖాజీపేటలో...

ఖాజీపేట, ఆగస్టు 18: ప్రభుత్వం విద్యాశాఖ అధికారులు యాప్‌ల పేరుతో బోధన సమయాన్ని హరిస్తూ ఉపాధ్యాయులను వేధించడం తగదని జిల్లా ఫ్యాప్టో నేతలు మహేష్‌బాబు, సనావుల్లా పేర్కొన్నారు. ఖాజీపేట ఎమ్మార్సీ భవనంలో ఎంఈఓ నాగస్వర్ణలతకు వినతి పత్రం అందించిన వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ అధికారులు ఏకపక్ష నిర్ణయాలతో రోజుకు ఒక కొత్త యాప్‌ను జత చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మండల ఫ్యాప్టో నేతలు బోశెట్టి రామమోహన్‌, రామాంజనేయులు, కరీముల్లా, ఈశ్వర్‌చంద్ర, సుబ్బారెడ్డి, మల్లికార్జున, ఓబన్న పాల్గొన్నారు.

Updated Date - 2022-08-19T04:32:57+05:30 IST