ఉత్కంఠగా బండలాగుడు పోటీలు

ABN , First Publish Date - 2022-05-19T05:51:49+05:30 IST

లింగాలపాడులో లక్ష్మీ పేరంటాళ్లమ్మ తిరునాళ్ల సందర్భంగా నిర్వహిస్తున్న రెండు రాష్ర్టాల స్థాయి ఎడ్ల బండలాగుడు పోటీలు ఉత్కంఠగా సాగుతున్నాయి.

ఉత్కంఠగా బండలాగుడు పోటీలు
పోటీలను ప్రారంభిస్తున్న ఉత్సవ కమిటీ చైర్మన్‌ హరిబాబు

లక్ష్మీపేరంటాళ్లమ్మ తిరునాళ్ల సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలస్థాయి పోటీలు 

నందిగామ రూరల్‌, మే 18:  లింగాలపాడులో లక్ష్మీ పేరంటాళ్లమ్మ తిరునాళ్ల సందర్భంగా నిర్వహిస్తున్న రెండు రాష్ర్టాల స్థాయి ఎడ్ల బండలాగుడు పోటీలు ఉత్కంఠగా సాగుతున్నాయి. ఈ పోటీలను మంగళవారం రాత్రి ఉత్సవ కమిటీ చైర్మన్‌ పారుపల్లి హరిబాబు ప్రారంభించారు. పాల పళ్ల విభాగంలో తొమ్మిది జతలు పాల్గొన్నాయని హరిబాబు తెలిపారు. బాపట్ల జిల్లా మార్టూరుకు చెందిన వేల్పుల సాయిప్రకాష్‌, తానికొండ రామకోటేశ్వరరావులకు చెందిన ఎడ్ల జత 10 నిముషాల వ్యవధిలో 3369.10 అడుగుల దూరాన్ని లాగి ప్రథమ స్థానంలో నిలిచి రూ.15 వేల నగదు బహుమతిని అందుకున్నాయి. గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం గనికపూడికి చెందిన కల్లూరి ప్రవీణ్‌కుమార్‌ ఎడ్ల జత 2838.04 అడుగుల దూరం లాగి ద్వితీయ స్థానంలో నిలిచి రూ. 12 వేల  బహుమతిని అందుకున్నాయి. బాపట్ల మండలం కొత్తఓడరేవుకు చెందిన నక్కా రాకేష్‌ రెడ్డికి చెందిన ఎడ్ల జత 2806.11 దూరం లాగి తృతీయ స్థానంలో నిలిచి రూ. 10 వేల బహుమతిని, పల్నాడు జిల్లా నరసారావుపేట మండలం, కేసానుపల్లికి చెందిన ముచ్చు ఏడుకొండలు, రాధికలకు చెందిన ఎడ్ల జత 2,541 అడుగుల దూరం లాగి నాలుగో స్థానంలో నిలిచి రూ.ఎనిమిది వేలను, పెనుగంచిప్రోలుకు చెందిన బిక్కి నరసింహారావుకు చెందిన ఎడ్ల జత 2,314 అడుగుల దూరం లాగి ఐదో స్థానంలో నిలిచి రూ. ఆరు వేలను, పల్నాడు జిల్లా, రాజుపాలెం మండలం, అంచులవారిపాలెం గ్రామానికి చెందిన వెంకటరమణ ఎడ్ల జత 2,230 అడుగుల దూరాన్ని లాగి ఆరో స్థానంలో నిలిచి రూ. నాలుగు వేల బహుమతిని అందుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌ బొల్లినేని పద్మజ, ఈవో తేజ, నిర్వాహకులు బండి వీరబాబు, మందలపు పెద్ద నరసింహారావు, కొల్లూరు శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-05-19T05:51:49+05:30 IST