ఉత్కంఠగా తాడిపత్రి వైస్‌ చైర్మన ఎన్నిక

ABN , First Publish Date - 2021-07-31T06:37:31+05:30 IST

భారీ బందోబస్తు మధ్య శుక్రవారం ఉత్కంఠభరితంగా జరిగిన మున్సిపల్‌ రెండవ వైస్‌ చైర్మన ఎన్నికలో టీడీపీ మద్దతు ఇచ్చిన అబ్దుల్‌రహీం విజయం సాధించారు.

ఉత్కంఠగా తాడిపత్రి వైస్‌ చైర్మన ఎన్నిక
వైస్‌ చైర్మనగా అబ్దుల్‌రహీంను ప్రకటిస్తున్న ఆర్డీఓ మధుసూదన

 సమావేశానికి వైసీపీ కౌన్సిలర్లు డుమ్మా

 మీసం తిప్పిన చైర్మన జేసీ ప్రభాకర్‌ రెడ్డి

 టీడీపీ మద్దతిచ్చిన ఇండిపెండెంట్‌ కౌన్సిలర్‌ అబ్దుల్‌ రహీం వైస్‌ చైర్మనగా ఏకగ్రీవం


తాడిపత్రి, జూలై 30: భారీ బందోబస్తు మధ్య శుక్రవారం ఉత్కంఠభరితంగా జరిగిన మున్సిపల్‌ రెండవ వైస్‌ చైర్మన ఎన్నికలో టీడీపీ మద్దతు ఇచ్చిన అబ్దుల్‌రహీం విజయం సాధించారు. ఆర్డీఓ మధుసూదన ఆధ్వర్యంలో జరిగిన వైస్‌ చైర్మన ఎంపిక కార్యక్రమానికి వైసీపీకి చెందిన 16 మంది కౌన్సిలర్లు డుమ్మా కొట్టగా, మున్సిపల్‌ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి హాజరుకాలేదు. ఆయన రాకపోవడంతో టీడీపీకి చెందిన 17 మంది కౌన్సిలర్లు, ఇండిపెండెంట్‌, సీపీఐ కౌన్సిలర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వైస్‌ చైర్మన కోసం 4వ వార్డు ఇండిపెండెంట్‌ కౌన్సిలర్‌ అబ్దుల్‌రహీం బరిలోకి దిగారు. ఆయనకు మద్దతుగా 18మంది కౌన్సిలర్లు చేతులు పైకెత్తారు. వైసీపీ కౌన్సిలర్లు హాజరుకాకపోవడంతో మెజార్టీ కౌన్సిలర్ల మద్దతు మేరకు అబ్దుల్‌రహీంను వైస్‌ చైర్మనగా అధికారులు ప్రకటించారు. అంతకుమునుపు వారం రోజుల నుంచి వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి, టీడీపీ మున్సిపల్‌ చైర్మన జేసీ ప్ర భాకర్‌రెడ్డిల మధ్య మాటలతూటాలు పేలుతుండడంతో శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకొని డీఎస్పీ చైతన్య ఆధ్వర్యంలో మున్సిపల్‌ కా ర్యాలయం పరిసర ప్రాంతాల్లో భారీబందోబస్తు ఏర్పాటుచేశారు. కేవ లం కౌన్సిలర్లు, మున్సిపల్‌ ఉద్యోగులను తప్ప మిగిలిన వారిని మున్సిపల్‌ కార్యాలయంలోకి అనుమతించలేదు.


జేసీ రాజకీయం ఏమిటో చూపిస్తా..

జేసీ రాజకీయం ఏమిటో ఇక నుంచి నేను చూపిస్తానంటూ వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని హెచ్చరిస్తూ మున్సిపల్‌ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి మీసం తిప్పారు. స్థానిక నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ మద్దతు ఇచ్చిన ఇండిపెండెంట్‌ కౌన్సిలర్‌.. వైస్‌ చైర్మన స్థానాన్ని కైవసం చేసుకొని తన సత్తా ఏమిటో వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డికి మరోసారి నిరూపించానన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో తాను గానీ, కొడుకు, భార్య గానీ తమ తడాఖా ఏమిటో జేసీ సోదరులకు చూపిస్తామని ప్రగల్భాలు పలికిన వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి చివరికి బొక్కబోర్లా పడ్డారని విమర్శించారు. వైస్‌ చైర్మన ఎంపిక ను బాయ్‌కాట్‌ చేయడానికి పోలీసులు సహకరించకపోవడమేనని వై సీపీ నాయకులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బాయ్‌కాట్‌ చే యడమంటే చేతగాని తనమనీ, అవమానమని ఎద్దేవా చేశారు. ‘నీ చే తగానితనం వల్ల ముఖ్యమంత్రి, జిల్లా ఇనచార్జ్‌ మంత్రికి అవమానకరంగా మారింది. నేనెక్కడా ప్రగల్భాలు పలకలేదు. ఇలాంటి అవమానం జరిగి ఉండుంటే నేనైతే ఊరువిడిచి వెళ్లేవాడిని. నేను కౌన్సిల్‌మీట్‌కు వెళ్లకుండా కౌన్సిలర్లతో వైస్‌ చైర్మన ఎన్నిక జరిపించి, నా సత్తా ఏమిటో చూపించా. ఈరోజు జరిగిన వైస్‌ చైర్మన ఎన్నికలో మహిళా కౌన్సిలర్లు మిమ్ములను కబడ్డీ ఆడించారు. మున్సిపల్‌ కార్యాలయం మెట్లు ఎక్కలేకపోయావని, మున్సిపల్‌ మినిట్స్‌ బుక్‌లో సంతకం పెట్టలేకపోయావంటే జేసీ పవర్‌ ఏమిటో తెలుసుకోవాల’ని ఎమ్మెల్యే పెద్దారెడ్డిని ఉద్దేశించి జేసీ ప్రభాకర్‌ రెడ్డి ఎద్దేవా చేశారు. జరగబోవు కో-ఆప్షన ఎంపికలో సైతం తన సత్తా ఏమిటో నిరూపిస్తానని జేసీ సవాల్‌ విసిరారు.


Updated Date - 2021-07-31T06:37:31+05:30 IST