ఉత్కంఠగా కౌన్సిల్‌ సమావేశం

ABN , First Publish Date - 2022-06-30T06:26:17+05:30 IST

ఉత్కంఠ నడుమ నందిగామ మునిసిపల్‌ సమావేశం సాగింది. ఇటీవల జరిగిన కౌన్సిల్‌ సమావేశానికి అధికార పార్టీ సభ్యులు గైర్హాజరు కావడం సంచలనం కలిగించింది.

ఉత్కంఠగా కౌన్సిల్‌ సమావేశం
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే డాక్టర్‌ జగన్మోహనరావు

నందిగామ మున్సిపాలిటీ వద్ద పోలీసు బందోబస్తు

నందిగామ, జూన్‌ 29: ఉత్కంఠ నడుమ నందిగామ మునిసిపల్‌ సమావేశం సాగింది. ఇటీవల జరిగిన కౌన్సిల్‌ సమావేశానికి అధికార పార్టీ సభ్యులు గైర్హాజరు కావడం సంచలనం కలిగించింది. ఆదే సమావేశంలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం, ఆందోళనలు జరిగాయి. దాంతో సమావేశం వాయిదా పడింది. బుధవారం జరిగే సమావేశంలో ఎటువంటి ఆందోళనలు జరగకుండా ముందస్తుగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. చైర్‌పర్సన్‌ మాడుగుల నాగరత్నం అధ్యక్షతన జరిగిన సమావేశంలో మొత్తం 94 అంశాలను ప్రవేశపెట్టారు. అన్ని అంశాలకు ఎటువంటి అభ్యంతరాలు లేకుండా ఆమోదం పొందటంతో ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే డాక్టర్‌ మొండితోక జగన్మోహనరావు మాట్లాడుతూ, పట్టణాభివృద్ధికి నిధులు సమీకరిస్తున్నట్లు తెలిపారు. ఆదర్శ మునిసిపాలిటీగా నందిగామను తీర్చిదిద్దుదామన్నారు. అధికారులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. 


అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోరా...

 పట్టణంలో అక్రమ కట్టడాలు జరుగుతున్నాయని, ఽఅధికారులు ఎందుకు ఉపేక్షిస్తున్నారని 12వ వార్డు కౌన్సిలర్‌ కొంగర శ్రీకాంత్‌ ప్రశ్నించారు. ఎన్ని భవనాలకు అనుమతులు ఇచ్చారో తెలపాలని అధికారులను కోరారు. తక్షణమే అక్రమ నిర్మాణ దారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 




Updated Date - 2022-06-30T06:26:17+05:30 IST