Abn logo
Mar 3 2021 @ 00:19AM

అదరగొట్టే...కోర్సెట్‌ లుక్‌

ఒంటికి అతుక్కుని, ఒంపులను తెలిపే 18వ శతాబ్దపు కోర్సెట్‌ ట్రెండ్‌ మళ్లీ మొదలైంది. పాత తరం ఫ్యాషన్‌ లుక్‌కు ఆధునికతను జోడించిన కొందరు బాలీవుడ్‌ ప్రముఖులు ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌ అని చెప్పకనే చెబుతున్నారు!

ఆలియా భట్‌: నల్లని రిస్కె రాల్ఫ్‌ అండ్‌ రూసో గౌన్‌ ధరించిన ఆలియా భట్‌ కోర్సెట్‌ స్టైల్‌కు కొత్త నిర్వచనం ఇచ్చే ప్రయత్నం చేసింది. ఎటువంటి యాక్సెసరీస్‌ ధరించకుండా, నడుము కింద నుంచి స్కర్ట్‌ను పోలి ఉండేలా గౌన్‌ డిజైన్‌ చేసుకున్న ఆలియా జుట్టును ముడి వేసి, కాటుక కళ్లు, న్యూడ్‌ లిప్స్‌తో కోర్సెట్‌ లుక్‌తో అదరగొట్టేసింది.

జాన్వీ కపూర్‌: కోర్సెట్‌ టాప్‌ను రిప్‌డ్‌ జీన్స్‌తో జోడించి మోడర్న్‌ లుక్‌తో ఆకర్షిస్తోంది జాన్వీ కపూర్‌. హై పోనీ టైల్‌, డీవై మేకప్‌లను ఎంచుకున్న జాన్వీ కిందకు జారిన నెక్‌లైన్‌, ఫుల్‌ స్లీవ్స్‌తో కోర్సెట్‌ టాప్‌ డిజైన్‌ చేసుకుంది. 

ఈ ఇద్దరు భామలే కాదు దీపికా పడుకొనె, కంగనా రనౌత్‌, శ్రద్ధా కపూర్‌లు కూడా తమదైన స్టైల్స్‌లో కోర్సెట్‌ లుక్‌కు కొత్త రూపాన్ని ఇస్తున్నారు.